Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనాతో యూఎస్ ఇంకా జీవన్మరణ పోరాటం చేస్తోంది: బైడెన్‌

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 7: కొవిడ్‌తో అమెరికా ఇంకా జీవన్మరణ పోరాటం సాగిస్తోందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. కొవిడ్‌ నియంత్రణకు చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆయన అన్నారు. వాషింగ్టన్‌ డీసీలో వర్జీనియా సబర్బ్‌లోని ఓ వ్యాక్సినేషన్‌ కేంద్రంలో ఆయన మాట్లాడారు. ‘‘వైర్‌సతో మనం ఇప్పటికీ జీవన్మరణ పోరాటం సాగిస్తున్నాం. ఇంకా చాలా మందికి వ్యాక్సిన్‌ వేయించాలి. కొవిడ్‌ నియంత్రణకు అందరూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. మీ (ప్రజలు) వంతు వచ్చినప్పుడు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ వేసుకోవాలి. మంచి కాలం ముందుంది. ప్రస్తుతం మనం తీసుకోబోయే జాగ్రత్తలే మన భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి’’ అని బైడెన్‌ పేర్కొన్నారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement