అమెరికాలో కొవిడ్ కల్లోలం.. 24 గంటల్లో..

ABN , First Publish Date - 2020-10-30T15:36:03+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఒకవైపు ఎన్నికల హడావుడి కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజే 90వేలకు పైగా కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.

అమెరికాలో కొవిడ్ కల్లోలం.. 24 గంటల్లో..

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికాలో ఒకవైపు ఎన్నికల హడావుడి కొనసాగుతుంటే.. మరోవైపు కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గురువారం ఒక్కరోజే 90వేలకు పైగా కేసులు నమోదు కావడం అక్కడ ఈ మహమ్మారి విజృంభణ ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. దేశంలో వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు 24 గంటల్లో 90వేలకు పైగా మంది కొవిడ్ బారినపడడం ఇదే మొదటిసారి అని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం పేర్కొంది. అక్టోబర్ నెల మధ్య నుంచి యూఎస్‌లో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలో గురువారం రాత్రి 8.30 గంటల వరకు 91,295 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 9.21 మిలియన్లకు చేరింది. అలాగే 2.30 లక్షలకు పైగా మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. కాగా, ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు, మరణాలతో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.  

Updated Date - 2020-10-30T15:36:03+05:30 IST