లక్ష దాటిన మరణాలు.. స్పందించని దేశాధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-05-28T22:04:31+05:30 IST

కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షలకు పైగా

లక్ష దాటిన మరణాలు.. స్పందించని దేశాధ్యక్షుడు

వాషింగ్టన్: కొవిడ్-19 ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 56 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 3.5 లక్షలు దాటారు. ఇక అమెరికాలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య బుధవారం లక్ష దాటింది. అమెరికాలో ఇప్పటివరకు 17,45,911 కేసులు నమోదు కాగా.. 1,02,114 మంది మృత్యువాతపడ్డారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అమెరికాలో కరోనా మరణాలు 60 వేలు దాటవని ట్రంప్ గతంలో చెప్పారు. అయితే ఆయన ఈ మాట చెప్పిన కొద్ది రోజులకే మరణాల సంఖ్య 60 వేలు దాటింది. ఆ తరువాత 70 వేలలోపు మరణాలు నమోదు కావచ్చని అన్నారు. ఇక ఆ సంఖ్య కూడా దాటేయడంతో 80 వేలు అని.. ఆ తరువాత లక్ష అని చెప్పారు. అమెరికాలో లక్ష నుంచి రెండు లక్షల మంది కరోనా కారణంగా మరణించవచ్చని తాజాగా ట్రంప్ చెప్పారు. ఇలా ట్రంప్ రోజుకో మాట చెప్పడంతో.. అమెరికన్లు ట్రంప్ చెప్పిన మాటలను నమ్మడం లేదు. అనేక సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఇదిలా ఉంటే.. వైట్‌హౌస్ అధికారులు మాత్రం అధ్యక్షుడు ట్రంప్ లక్ష మంది మరణించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - 2020-05-28T22:04:31+05:30 IST