అగ్రరాజ్యంలో వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ

ABN , First Publish Date - 2021-01-14T19:39:30+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.

అగ్రరాజ్యంలో వేగవంతంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ

కోటి దాటిన.. మొదటి డోసు టీకా తీసుకున్నవారి సంఖ్య

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. డిసెంబర్ రెండో వారంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన అమెరికా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా టీకా మొదటి డోసు తీసుకున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) బుధవారం వెల్లడించింది. కాగా, ఇప్పటివరకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు టీకా ఇవ్వగా.. ఇప్పటి నుంచి 65 ఏళ్లకు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని రాష్ట్రాలన్నీ ఆదేశించాయి. ఫైజర్, మోడెర్నా టీకాల అత్యవసర వినియోగానికి ఆమోదించిన అమెరికా.. ఆయా కంపెనీల నుంచి ఇప్పటికే భారీగా డోసులను కొనుగోలు చేసింది. దీనిలో భాగంగా రెండు సంస్థలు మూడు కోట్ల డోసులను రెడీ చేశాయి. మరోవైపు యూఎస్‌లో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం ఒకేరోజు ఇంతకుముందెన్నడూ లేని విధంగా 4,470 మంది కరోనాకు బలయ్యారు.  అంటే.. నిమిషానికి ముగ్గురిపైనే చనిపోయారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య  2కోట్ల 27 లక్షలకు చేరగా.. ఇందులో 3.80 లక్షల మంది వరకు మరణించారు. 


Updated Date - 2021-01-14T19:39:30+05:30 IST