భలే భలే.. అదరగొట్టేశాడుగా.. ఆ అమెరికన్ Viral Video చూసి తెగ సంబరపడిపోతున్న భారతీయులు!

ABN , First Publish Date - 2021-11-20T00:46:08+05:30 IST

మాతృభాష అంటే ఎవరికి అభిమానం ఉండదు చెప్పండి..? ఇక విదేశస్తులు నోట మన భాష వినిపించిందంటే.. మనసంతా గర్వంతో నిండిపోతోంది. అందుకే..ఓ అమెరికన్ యూట్యూబర్ చేసిన యూట్యూబ్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

భలే భలే.. అదరగొట్టేశాడుగా.. ఆ అమెరికన్ Viral Video చూసి తెగ సంబరపడిపోతున్న భారతీయులు!

ఇంటర్నెట్ డెస్క్: మాతృభాష అంటే ఎవరికి అభిమానం ఉండదు చెప్పండి..? ఇక విదేశస్తులు నోట మన భాష వినిపించిందంటే.. మనసంతా గర్వంతో నిండిపోతోంది.  అందుకే..ఓ అమెరికన్ యూట్యూబర్ చేసిన యూట్యూబ్ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అనేక మంది భారతీయులు, బాంగ్లాదేశీయులు ఈ వీడియోకు లైకులు, షేర్లతో తమ మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాకు చెందిన ఆరీ స్మిత్ అనే యూట్యూబర్.. న్యూయార్క్‌ నగరంలోని క్వీన్స్ ప్రాంతంలోని దక్షిణాసియా సంతతి వారు అధికంగా ఉండే ఓ వీధిలో షాపింగ్‌కు వెళ్లి.. అక్కడున్న వారితో బెంగాలీలోనే మాట్లాడుతూ ఆశ్చర్యపరిచాడు. ఇదంతా రికార్డు చేసి తన యూట్యూబ్ ఛానల్  Xiaomanyc ఛానల్‌లో పెట్టగా ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. 


మొదట ఓ పాన్ షాపులో పాన్ కావాలంటూ బెంగాలీలోనే అడిగి.. వారిని ఆశ్చర్యపరిచాడు. భారతీయ రుచులకు స్మిత్ కొత్త కావడంతో.. పాన్ ఎలా తినాలో వాళ్లే నేర్పించాడు. మరో చోట.. వీధి వ్యాపారి వద్ద పైజామా కొనుగోలు చేస్తూ వాటి రేటెంతో చెప్పాలంటూ  బెంగాలీలో అడగడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. అంతేకాదు.. సమీపంలో నిలబడ్డ ఓ వ్యక్తి స్మిత్‌ను పలకరించి..  ‘‘మీరు బెంగాల్ ఎక్కడ నేర్చుకున్నారు’’ అని కూడా అడిగాడు. ఈ దృశ్యాలన్నీ ప్రస్తుతం భారతీయ, బంగ్లాదేశీ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అనేక మంది స్మిత్‌పై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. 


‘‘అమెరికాకు వలసొచ్చిన అనేక మంది విదేశీయులు ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేక అవహేళనకు గురవుతుంటారు. ఈ స్థితిలో ఓ అమెరికన్ ఇలా తమ మాతృభాషలో మాట్లాడటం చూసి.. అక్కడి వారి మనసు ఆనందంతో నిండిపోయింది. అతడి ప్రయత్నం ఎంతో ఆనందాన్నిచ్చింది.’’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. అయితే.. బెంగాలీ భాషాసంప్రదాయాలు అంతగా ప్రాచుర్యం కాలేదన్న స్మిత్ వ్యాఖ్యలకు కూడా కొందరు స్పందించారు. అది నిజమే అంటూ కామెంట్లు పెట్టారు. కాగా.. స్మిత్ బెంగాలీ స్వీట్లు, రసగుల్లాను కూడా రుచి చూశాడు. 



Updated Date - 2021-11-20T00:46:08+05:30 IST