అమ్మకానికి లింక్డ్‌ ఇన్‌ యూజర్ల డేటా

ABN , First Publish Date - 2021-04-10T06:34:56+05:30 IST

ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌కు చెందిన 50 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి గురయిందని, ఒక హ్యాకర్ల బృందం ఆ డేటాను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టిందని సైబర్‌ న్యూస్‌ తన నివేదికలో తెలిపింది

అమ్మకానికి లింక్డ్‌ ఇన్‌ యూజర్ల డేటా

న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ వెబ్‌సైట్‌కు చెందిన 50 కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత డేటా చౌర్యానికి గురయిందని, ఒక హ్యాకర్ల బృందం ఆ డేటాను బహిరంగ మార్కెట్లో అమ్మకానికి పెట్టిందని సైబర్‌ న్యూస్‌ తన నివేదికలో తెలిపింది. ఇందుకు ఆధారంగా ఆ బృందం 20 లక్షల మంది యూజర్ల డేటాను లీక్‌ చేశారని, అందులో యూజర్ల పూర్తి పేర్లు, ఇ మెయిల్‌ అడ్ర్‌సలు, ఫోన్‌ నంబర్లు, వారు పని చేస్తున్న ప్రదేశాల వివరాలు ఉన్నాయని ఆ నివేదిక రచయిత తెలిపారు. అయితే ఈ వార్తను లింక్డ్‌ ఇన్‌ యాజమాన్యం వెనువెంటనే ఖండించింది. 

Updated Date - 2021-04-10T06:34:56+05:30 IST