రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2020-07-10T10:46:01+05:30 IST

జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్లు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ నాయకులు ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

రేషన్‌ డీలర్ల ఖాళీలను భర్తీ చేయాలి

డీఎస్వోకు డీవైఎఫ్‌ఐ నాయకుల వినతి


ఖమ్మం కలెక్టరేట్‌, జూలై9: జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ డీలర్లు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డీవైఎఫ్‌ఐ నాయకులు ఆధ్వర్యంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేందర్‌కు గురువారం విన్నవించారు. జిల్లాలో 86 డీలర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని తక్షణమే భర్తి చేయాలని కోరారు. ఆర్డీవో ఆధ్వర్యంలో డీలర్‌ పోస్టులను నియమించడానికి చర్యలు తీసుకుంటామని డీఎస్వో ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. డీఎస్వోను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షుడు  పొడగంటి రాంబాబు, సహాయ కార్యదర్శి చింతల రమేష్‌, ఉపాఽధ్యక్షుడు శీలం వీరబాబు పదముత్తుల మంగయ్య అశోక్‌ తదితరులున్నారు. 


Updated Date - 2020-07-10T10:46:01+05:30 IST