2.52లక్షల పశువులకు వ్యాక్సినేషన్‌ లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-28T04:24:12+05:30 IST

2.52లక్షల పశువులకు వ్యాక్సినేషన్‌ లక్ష్యం

2.52లక్షల పశువులకు వ్యాక్సినేషన్‌ లక్ష్యం
సమీక్షలో మాట్లాడుతున్న సదానందం

తాండూరు రూరల్‌: గాలికుంటు వ్యాధి నివారణకు వికారాబాద్‌ జిల్లాలో 52 టీంల ద్వారా పశువులకు వ్యాక్సిన్‌ వేస్తున్నామని జిల్లా పశు సంవర్ధ్దకశాఖ అధికారి సదానందం తెలిపారు. బుధవారం తాండూరు మండలం జినుగుర్తి, బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌ గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం తాండూరు పశుసంవవర్దక శాఖ కార్యాలయంలో గాలికుంటు వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్‌కు సంబంధించి జూనియర్‌ పశుసంవర్దక శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 2.52లక్షల పశువులకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా,  ఇప్పటి వరకు 92వేల  జీవాలకు టీకాలు వేయడం జరిగిందన్నారు. వచ్చేనెల 17 నాటికి లక్ష్యం పూర్తి చేస్తామన్నారు. వికారాబాద్‌ జిల్లాలో 95 పశుసంవర్దక కేంద్రాలుండగా వాటిలో 58 ఉపకేంద్రాలున్నాయన్నారు. 37 మంది జూనియర్‌ వెటర్నరీఅధికారులున్నారని పేర్కొన్నారు. రైతులు తప్పకుండా  పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్‌ నిజానంద్‌, హతిరామ్‌, సరిత పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:24:12+05:30 IST