తెలంగాణలో రేపటి నుంచి వాక్సిన్ సెంటర్ల పెంపు

ABN , First Publish Date - 2021-01-17T20:46:05+05:30 IST

తెలంగాణలో సోమవారం నుంచి వాక్సిన్ సెంటర్ల పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు రాష్ట్రంలో 500 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా

తెలంగాణలో రేపటి నుంచి వాక్సిన్ సెంటర్ల పెంపు

హైదరాబాద్: తెలంగాణలో సోమవారం నుంచి వాక్సిన్ సెంటర్ల పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపు రాష్ట్రంలో 500 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. 30 నుంచి 100 మంది వరకు వాక్సిన్ తీసుకొనేలా ఏర్పాట్లు చేశారు. కొవిన్ సాప్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. లబ్ధిదారుల ఎంపికపై ఇబ్బందులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మాన్యువల్‌గా అయినా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌ టీకా కార్యక్రమం రాష్ట్రంలో తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం 10.30కు వర్చువల్‌గా ప్రధాని ప్రసంగం పూర్తవ్వగానే.. రాష్ట్రంలోని 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొదటి టీకాను గాంధీ ఆస్పత్రిలో సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్న వాల కిష్టమ్మకు వేశారు. ఆమె గాంధీ ఆస్పత్రిలో 14 ఏళ్లుగా సఫాయీ కర్మచారిగా పనిచేస్తున్నారు. కరోనా తారాస్థాయిలో ఉన్నప్పుడు ఆమె కుటుంబానికి దూరంగా ఉంటూ.. కొవిడ్‌ వార్డుల్లో సేవలు అందించారు. కొన్నిచోట్ల వ్యాక్సినేషన్‌కు రాకపోవడంతో.. 94% మందికే టీకాలు ఇచ్చారు.

Updated Date - 2021-01-17T20:46:05+05:30 IST