టీకా.. ఓకే !

ABN , First Publish Date - 2021-01-17T08:04:59+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

టీకా.. ఓకే !

  • తొలి రోజు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌  విజయవంతం 
  • 31,570 మందికి గాను 19,025 మందికి టీకా 
  • ఏపీలో 60.2%, తెలంగాణలో 92.2% మందికి
  • విజయవాడలో ప్రారంభించిన సీఎం జగన్‌ 
  • శానిటేషన్‌ వర్కర్‌ పుష్పకుమారికి తొలి వ్యాక్సిన్‌ 
  • రాష్ట్రంలోని 332 కేంద్రాల్లో
  • ముగ్గురికి స్వల్ప అస్వస్థత..చికిత్స తర్వాత ఓకే 


అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి):  కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ప్రక్రియ తొలిరోజు విజయవంతమైంది. శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సీఎం జగన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటిరోజున 19,025 (60.2%)మందికి టీకా వేశారు. తెలంగాణలో 4,296మందికిగాను 3,962 (92.2ు) మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. ఏపీలో తొలి వ్యాక్సిన్‌ను విజయవాడ జీజీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్‌ వర్కర్‌ బి.పుష్పకుమారికి జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శర్మిష్ట అందించారు. సీఎం జగన్‌ సమక్షంలో ఆమె టీకా వేయించుకున్నారు. అమెతో పాటు ఎఫ్‌ఎన్‌వో సి.హెచ్‌.నాగజ్యోతి, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్‌ పి.జయకుమార్‌, జనరల్‌ ఫిజీషియన్‌ ఎల్‌.ప్రణీత, డాక్టర్‌ బి.బసవేశ్వర్‌కు వరుసగా టీకాలు వేశారు. వ్యాక్సినేషన్‌ అనంతరం సీఎం వారితో కాసేపు ముచ్చటించారు. మన దేశానికి చెందిన శాస్త్రవేత్తలు కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ విషయమన్నారు.


అనంతరం వ్యాక్సినేషన్‌ కోసం ఏర్పాటు చేసిన గదులను సీఎం పరిశీలించారు. కాసేపు ఆరోగ్యశాఖ సిబ్బందితో ముచ్చటించి, టీకా ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. అనంతరం వ్యాక్సినేషన్‌పై అవగాహన కోసం ఆరోగ్యశాఖ రూపొందించిన గోడపత్రాలు తదితరాలను జగన్‌ ఆవిష్కరించారు. విజయవాడలో సీఎం ఈ ప్రక్రియ ప్రారంభించగానే రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో ఒకేసారి వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. 


ముగ్గురికి స్వల్ప అస్వస్థత 

రాష్ట్రవ్యాప్తంగా శనివారం 19,108 మందికి టీకా వేయగా ముగ్గురు మాత్రం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వ్యాక్సిన్‌ తీసుకున్న వెంటనే ఎఫ్‌ఎన్‌వో రాధ కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని అత్యవసర వార్డుకు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఒక్కసారిగా కళ్లు తిరిగాయని, చాలా చలిగా అనిపించిందని వైద్యులకు రాధ వివరించింది. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, అయితే ఇంకా కొంత చలిగా ఉందని తెలిపింది. టీకా తీసుకునేటప్పుడు ఒత్తిడికి గురవడం వల్లే ఆమెకు ఇలా జరిగిందని వైద్యాధికారులు చెప్పారు. కాగా, అనంతపురం జిల్లాకేంద్రంలోని సర్వజనాస్పత్రిలో అఖిల అనే హెల్త్‌ వర్కర్‌ టీకా వేయించుకున్న కొద్దిసేపటికి అస్వస్థతకు లోనై, వాంతులు చేసుకున్నారు. వైద్యులు ఆమెను ఆస్పత్రిలోని ఏఎంసీ విభాగానికి తరలించి, చికిత్స అందించారు. ఆమె ఆరోగ్యంగానే ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నవీద్‌ అహ్మద్‌ తెలిపారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో వ్యాక్సిన్‌ వేయించుకున్న ఆశా వర్కర్‌ బాల స్వల్ప అస్వస్థతకు గురైంది. ఆమెకు కళ్లు తిరగడంతో వెంటనే రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి పంపి వైద్యం చేయించారు. ఒత్తిడికి లోనవడంతో గుండె సంబంధమైన పరీక్షలు చేశారు. తదుపరి పరీక్షల కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు పేర్కొన్నారు. 


మొరాయించిన వెబ్‌సైట్‌ 

కొవిన్‌ వెబ్‌సైట్‌కు సాఫ్ట్‌వేర్‌ సమస్యలు తలెత్తడంతో శనివారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చాలా ఆలస్యంగా సాగింది. వీటిని పరిష్కరించడంలో కేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందం విఫలం కావడంతో చాలా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగింది. కొన్ని కేంద్రాల్లో కొవిన్‌ వెబ్‌సైట్‌కు సంబంధం లేకుండానే ఆధార్‌ నంబరు ఆధారంగా టీకా వేయాల్సి వచ్చింది. ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు కేంద్రానికి సమాచారం అందించినా  ఫలితం లేకుండా పోయింది. సాయంత్రానికి గానీ వెబ్‌సైట్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. 


సమయం పొడిగింపు 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభం కావడంతో కేంద్రప్రభుత్వం సమయాన్ని పొడిగించింది. నిబంధనల ప్రకారం ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే వ్యాక్సినేషన్‌ చేయాలి. అయితే రాష్ట్రంలో దాదాపు మధ్యాహ్నం 12గంటల తర్వాత వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. తొలిరోజు కావడంతో కేంద్రం సమయాన్ని రాత్రి 9గంటల వరకూ పొడిగించింది. ఆదివారం నుంచి ఉదయం 9 - సాయత్రం 5 గంటల వరకూ మాత్రమే వ్యాక్సినేషన్‌ చేస్తారు. 


60.2% మందికి టీకా 

రాష్ట్ర వ్యాప్తంగా తొలిరోజు 32,739 మందికి వ్యాక్సిన్‌ వేయాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 19,025 మంది హెల్త్‌కేర్‌ వర్కర్లు (60.2ు) వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. కొంతమంది భయంతో తప్పించుకుంటుంటే, మరికొందరు ముక్కనుమ సాకుతో సెల్‌ఫోన్లు స్విచ్చాఫ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకొందరు అనారోగ్య కారణాలు చూపించి దూరంగా ఉన్నారు. తాము వ్యాక్సిన్‌ వేసుకోబోమని, ఇష్టం లేదని విశాఖపట్నం జిల్లా చోడవరంలో ఏడుగురు రాతపూర్వకంగా రాసిచ్చారు. నర్సీపట్నం కేంద్రంలో 100మందికి గాను అందరూ వచ్చి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో పేర్లు నమోదు చేసుకున్న వైద్యులకు ఫోన్లు చేసినా, తాము సంక్రాంతి సెలవులో ఉన్నామని కొందరు, పండుగలకు ఊరికి వచ్చామని మరికొందరు తప్పించుకున్నారు. అయితే కొవిన్‌ వెబ్‌సైట్‌లో నమోదున్న విత్తనాలు ఇప్పటికి 60ు మాత్రమే పంపిణీ చేశారు. ఈ పరిస్థితుల్లో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. వాస్తవంగా వర్షాలు బాగా పడటంతో చెరువులు, ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. ఖరీఫ్‌ పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆ నష్టాన్ని పూడ్చుకునేందుకు రబీ సాగువైపు రైతులు విస్తృతంగా కదలాలి. కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. సాగు విస్తీర్ణం గతేడాది గణాంకాలను కూడా ఇంతవరకూ చేరుకోలేదు. మున్ముందైనా రబీ సాగు పుంజుకుంటుందో లేదో చూడాలి. 

Updated Date - 2021-01-17T08:04:59+05:30 IST