Advertisement
Advertisement
Abn logo
Advertisement

వంగూరి ఫౌండేషన్ వారి 27వ ఉగాది ఉత్తమ రచన పోటీలు

గత 27 సంవత్సరాల సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాబోయే 'శుభకృతు' నామ సంవత్సర ఉగాది (ఏప్రిల్ 1, 2022) సందర్భంగా వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు అంతర్జాతీయ స్థాయిలో 27వ ఉగాది ఉత్తమ రచనల పోటీ నిర్వహిస్తున్నారు. స్నేహపూర్వకమైన ఈ పోటీలో రెండు విభాగాలు ఉన్నాయి.


1. ప్రధాన విభాగం

భారతదేశం మినహా విదేశాలలో ఉన్న తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత రచనలని ఈ పోటీకి ఆహ్వానించారు నిర్వాహకులు. దీనిలో భాగంగా ఉత్తమ కథానిక, ఉత్తమ కవిత విభాగాల్లో చెరో రెండు బహుమతులను ప్రకటించారు.

ఉత్తమ కథానిక: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: 116 డాలర్లు(రూ.8,628)

ఉత్తమ కవిత: (రెండు సమాన బహుమతులు) ఒక్కొక్కటీ: 116 డాలర్లు(రూ.8,628)


2. మొట్టమొదటి రచనా విభాగం

ప్రపంచ వ్యాప్తంగా కథ, కవితలూ రచించే కుతూహలం ఉన్నా వారిని, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరి కొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నారు. తరాల తారతమ్యం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక రచయితలు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులు.


'నా మొట్టమొదటి కథ': (ఉత్తమ కథ): 116 డాలర్లు(రూ.8,628)

'నా మొట్టమొదటి కవిత': (ఉత్తమ కవిత): 116 డాలర్లు(రూ.8,628)


రచన పోటీలకు షరతులివే..

* ఒక రచయిత ఒక్కొక్క ప్రక్రియకి ఒక రచన మాత్రమే పంపించాల్సి ఉంటుంది. వీలయినంత వరకూ అన్ని రచనలూ యూనికోడ్ (గౌతమి ఫాంట్స్)లో మాత్రమే పంపించాలి. అలాగే చేతివ్రాతలో కథలు పదిహేను పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపు ఉండాలి. PDF, JPEG ఫార్మాట్లలో కూడా పంపించవచ్చు.

* తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకునే వెసులుబాటు ఉంది.

* రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్ మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న రచనలు పరిగణలోకి రావు. ఈ మేరకు హామీ పత్రం రచనతో పాటు విధిగా జత పరచాలి. అలాగే 'మొట్టమొదటి కథ', 'మొట్టమొదటి కవిత' పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలు అని హామీ పత్రంలో పేర్కొనాలి.

* బహుమతి పొందిన రచనలూ, ప్రచురణకి అర్హమైన ఇతర రచనలూ కౌముది.నెట్‌లోనూ, మధురవాణి.కామ్ తదితర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయాలనుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.

* విజేతల వివరాలు ఉగాది పండుగ నాడు (ఏప్రిల్ 1, 2022) కాని, అంతకు ముందు కాని ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ ఆయా రచయితలవే అయినా, ఆ ఈ తేదీ లోపుగా పోటీకి పంపిన రచనలను రచయితలు ఇంకెక్కడా ప్రచురించకూడదు.

* విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

* రచనలు వంగూరి ఫౌండేషన్ వారికి అందవలసిన చివరి తేదీ: మార్చ్ 15, 2022.Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement