అజేయ్ కల్లాంపై వర్ల రామయ్య సెటైర్లు

ABN , First Publish Date - 2021-01-14T21:37:16+05:30 IST

ముఖ్యమంత్రి సలహాదారు అజేయ్ కల్లాంపై ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు

అజేయ్ కల్లాంపై వర్ల రామయ్య సెటైర్లు

అమరావతి: ముఖ్యమంత్రి సలహాదారు అజేయ్ కల్లాంపై ట్విట్టర్ వేదికగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అజేయ్ కల్లాం గారు, నాలుగు రూపాయల నెల జీతం, చిన్న హోదా కోసం, ఆత్మాభిమానాన్ని అంతగా తాకట్టు పెట్టు కోవాలా? ఐఏఎస్ అధికారిగా అంతకాలం ప్రజాసేవ చేసింది మీరేనా? ఏమిటండీ మీరు మరీనూ, మహాత్మాగాంధీ వారసుడు ముఖ్యమంత్రి జగనా? గాంధీజీ కలలు నెరవేర్చేది మన ముఖ్యమంత్రి గారా? విడ్డూరంగా లేదూ? హవ్వా!’ అంటూ ట్విట్టర్‌లో వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.



Updated Date - 2021-01-14T21:37:16+05:30 IST