Advertisement
Advertisement
Abn logo
Advertisement

రమ్య హత్య ఘటనతో అందరూ నివ్వెరపోయారు: వాసిరెడ్డి పద్మ

గుంటూరు: విద్యార్థిని రమ్య హత్య ఘటనతో అందరూ నివ్వెరపోయారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఇలాంటి ఘటన చాలా బాధాకరమన్నారు. ఇలాంటి చర్యలను సమాజం మొత్తం ఖండించాలని సూచించారు. పరిచయం ఉన్న వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తెలుస్తోందని, దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని వాసిరెడ్డి పద్మ చెప్పారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని నల్లపు రమ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.  అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement