Advertisement
Advertisement
Abn logo
Advertisement

హృదయం ముక్కలైంది..

విధిని విశ్వసిస్తా.. అక్క కోలుకుంటుందనుకున్నా

వేదా కృష్ణమూర్తి


న్యూఢిల్లీ: కొద్ది రోజుల వ్యవధిలో తల్లి, సోదరి కొవిడ్‌ మహమ్మారికి బలి కావడంతో భారత మహిళా జట్టు క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఇప్పుడిప్పుడే ఆ దుఃఖంనుంచి కోలుకుంటున్న ఆమె..విపత్కర సమయాల్లో మానసికంగా దృఢంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. కర్ణాటకలోని చిక్‌మగళూర్‌కు చెందిన వేద ఇంటిలో ఏకంగా 9మంది కరోనా బారిన పడ్డారు. వారిలో ఆమె తల్లి, అక్క రెండు వారాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ‘విధిని గాఢంగా నమ్ముతా.


అక్క కోలుకొని ఇంటికి వస్తుందని విశ్వసించా. అయితే ఆమె మృతి చెందడంతో నా హృదయం ముక్కలైంది. కుటుంబానికి ఇప్పుడు నేనే ధైర్యం చెప్పాలి’ అని పేర్కొంది. ఇంట్లో అందరికీ కరోనా సోకడం, వారిలో ఇద్దరు మరణించడంతో తాను తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యానంది. గతంలో తానూ మానసిక సమస్యలను ఎదుర్కొన్నానని, ఇలాంటి ఇబ్బంది ఏర్పడిన వారికి నిర్మాణాత్మక మద్దతు ఇవ్వాలని అభిప్రాయపడింది. 

Advertisement
Advertisement