కూరగాయాలు..ఘాటెక్కుతున్న ఉల్లి

ABN , First Publish Date - 2020-09-28T08:56:22+05:30 IST

రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొవిడ్‌ నిబంధనలతో వివాహాది శుభకార్యాలు పెద్దగా జరగక, కూరగాయలకు

కూరగాయాలు..ఘాటెక్కుతున్న ఉల్లి

అత్యధికం కిలో 50 పైనే

100కు చేరువలో క్యారెట్‌, బీర తదితరాలు

వినియోగదారులకు కనిపిస్తున్న చుక్కలు

పంటలు దెబ్బతినడం, రవాణా లేకపోవడమే

పెరుగుదలకు కారణమంటున్న వ్యాపారులు

పండగలు, పెళ్లిళ్లవంటి 

గిరాకీలు ఏమీ లేకపోయినా కూరగాయల ధరలు 

నింగినంటుతున్నాయి. వినియోగదారులకు 

చుక్కలు చూపిస్తున్నాయి.

క్యారెట్‌, బీర ధరలు రూ.వందకు చేరువలో 

ఉంటే.. ఉల్లి ధర రోజు రోజుకూ పెరిగిపోతోంది. 


(అమరావతి, ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కొవిడ్‌ నిబంధనలతో వివాహాది శుభకార్యాలు పెద్దగా జరగక, కూరగాయలకు డిమాండ్‌ లేకపోయినా, ధరలు మాత్రం ఆకశానంటుతున్నాయి. హోల్‌సేల్‌ ధరలే భారీగా పెరగాయి. రిటైల్‌ వ్యాపారులు ఇంకొంత పెంచి అమ్ముతుండడంతో వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. టమాట, బెం డ, దొండ, దోస, వంకాయ, బంగాళదుంప, బీరకాయ ధర లు బాగా పెరిగాయి. టమాట హోల్‌సేల్‌గా 25 కిలోలు రూ.900 ఉండగా, కిలో రూ.50కి తక్కువ అమ్మడం లే దు. నాణ్యమైన టమాట రూ.60 పలుకుతోంది. బెండకాయలు హోల్‌సేల్‌లో 25 కిలోలు రూ.1200 దాకా ఉండటంతో రిటైల్‌లో కిలో రూ.60కి అమ్ముతున్నారు. కాకరకాయలు హోల్‌సేల్‌ ధర రూ.1,500కి చేరింది. దీంతో కిలో రూ.70పైనే చెప్తున్నారు. దోసకాయలు కిలో రూ.50, బీట్‌రూట్‌ కిలో రూ.60 ఉండగా, క్యారెట్‌ రూ.80కి చేరింది.


బంగాళాదుంప కిలో రూ.50కి చేరగా, గోరు చిక్కుడు, దొండ, వంకాయ రూ.40కి తగ్గడం లేదు. పచ్చిమిర్చి కూడా రూ.50పలుకుతోంది. బీరకాయ కిలో రూ.100కి చే రింది. ఇతర రకాలు ఇందుకు భిన్నంగా లేవు. దాదాపు అ న్ని రకాల కూరలూ ప్రియంగానే ఉన్నాయి. ఉల్లిపాయ లు కూడా కొన్ని చోట్ల కిలో రూ.60 చెప్తున్నారు. రైతుబజార్లలోనూ ధరలు కాస్త అటుఇటుగా ఉంటున్నాయి. పైగా నాణ్యమైన సరుకు లభ్యత తక్కువగా ఉంటోందన్న ఆరోపణలున్నాయి. దీంతో మార్కెట్లలోనే కొనుగోళ్లు ఎక్కువగా ఉంటున్నాయి. అన్‌సీజన్‌లోనే ధర లు ఇలా ఉంటే రానున్న పండుగల వేళ ధరలు మరింత పెరుగుతాయే మోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది. కర్ణాటక నుంచి క్యారెట్‌, మహారాష్ట్ర నుంచి ఉల్లి, బంగాళదుం ప రవాణా తగ్గి ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెప్తున్నారు.  

Updated Date - 2020-09-28T08:56:22+05:30 IST