కరోనాలోనూ పెరిగిన వాహనాల విక్రయాలు..

ABN , First Publish Date - 2021-01-12T22:20:45+05:30 IST

కరోనా, స్ట్రెయిన్... తదితర వైరస్ ల నేపధ్యంలో మార్కెట్ పడిపోయిన విషయం తెలిసిందే. ఇక వాహనాలు విక్రయాలు మరీ దారుణంగా పడిపోయాయి. అయితే ప్యాసెంజర్‌‌‌‌‌‌‌‌ వాహనాలరిటైల్‌‌‌‌ అమ్మకాలు మాత్రం డిసెంబరు లో 23.99 శాతం పెరిగాయని ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్‌(ఫాడా)‌‌‌ ప్రకటించింది.

కరోనాలోనూ పెరిగిన వాహనాల విక్రయాలు..

ముంబై : కరోనా, స్ట్రెయిన్... తదితర వైరస్ ల నేపధ్యంలో మార్కెట్ పడిపోయిన విషయం తెలిసిందే. ఇక వాహనాలు విక్రయాలు మరీ దారుణంగా పడిపోయాయి. అయితే ప్యాసెంజర్‌‌‌‌‌‌‌‌ వాహనాలరిటైల్‌‌‌‌ అమ్మకాలు మాత్రం డిసెంబరు  లో 23.99 శాతం పెరిగాయని ఫెడరేషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్‌(ఫాడా)‌‌‌ ప్రకటించింది.


డిసెంబరు 2019 లో 2,18,775 ప్యాసెంజర్ వెహికల్స్ అమ్ముడవ్వగా, కిందటి నెలలో మాత్రం 2,71,249 వహనాలు అమ్ముడుపోయాయని పేర్కొంది. ఫెస్టివ్‌‌‌‌ సీజన్‌‌‌‌ నుంచి డిమాండ్‌ కొనసాగుతోందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 1,270 రవాణా కార్యాలయాల నుంచి సేకరించిన రిజిస్ట్రేషన్లఆధారంగా ఫాడా ఈ డేటాను విడుదల చేసింది. 


గతేడాది డిసెంబరులో 14,24,620 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయని, ఇవి డిసెంబరు, 2019 లో అమ్ముడైన 12,73,318 వాహనాలకంటే 11.88 శాతం ఎక్కువని పేర్కొంది. ఇక కమర్షియల్‌‌‌‌ వెహికల్ సేల్స్‌‌‌‌ 59,497 యూనిట్ల నుంచి 13.52 శాతం పడిపోయి గత నెలలో 51,454 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రీ వీలర్స్ అమ్మకాలైతే డిసెంబరులో 52.75 శాతం పడిపోయాయి.


ఇక.. 20‌‌‌‌‌‌‌‌19 డిసెంబరు‌‌‌‌‌‌‌లో 58,651 వాహనాలు అమ్ముడు పోగా, గత నెలలో 27,715 యూనిట్లకు ఈ సేల్స్ పడిపోయింది. ట్రాక్టర్ల అమ్మకాలు 35.49 శాతం పెరిగి 51,004 యూనిట్ల నుంచి 69,105 యూనిట్లకు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి సారిగా డిసెంబరులో వెహికల్ రిజిస్ట్రేషన్లు పెరిగాయని ఫాడా ప్రెసిడెంట్‌‌‌‌ వింకేష్‌‌‌‌ గులాటి చెప్పారు. 

Updated Date - 2021-01-12T22:20:45+05:30 IST