Abn logo
Apr 19 2021 @ 00:21AM

కల్యాణ వేంకటేశ్వరుడు

పెండ్లికుమారుడు, కుమార్తెలుగా స్వామివారు, అమ్మవార్లు

జమలాపురంలో వైభవంగా క్రతువు

ఎర్రుపాలెం, ఏప్రిల్‌ 18: జమలాపురం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజైన ఆదివారం స్వామివారు, అమ్మవార్లను పెండ్లికుమారుడు, పెండ్లికుమార్తెలుగా అలంకరించి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ప్రాతఃకాల పూజల అనంతరం యాగశాల యందు అవాహితదేవతా అనుష్టానాలు, హోమాలు, బలిపీఠ, ధ్వజపూజలు జరిపారు. సోమవారం జరిగే వేంకటేశ్వరస్వామి, అలివేలుమంగమ్మ, పద్మావతి అమ్మవార్లకు పంచామృత స్నపనం చేశారు. నూతన వస్త్రాలంకరణలో పెండ్లికుమారుడు, కుమార్తెలుగా తయారు చేసే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ధర్మకర్త కృష్ణమోహన్‌శర్మ, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement