బైడెన్‌, కమలకు శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2021-01-21T05:00:23+05:30 IST

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి వీరికి అభినందనలు వెల్లువెత్తాయి.

బైడెన్‌, కమలకు శుభాకాంక్షలు తెలిపిన వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారాలు చేశారు. ఈ సందర్భంగా ప్రపంచం నలుమూలల నుంచి వీరికి అభినందనలు వెల్లువెత్తాయి. మన భారత దేశ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు కూడా బైడెన్, కమలకు శుభాకాంక్షులు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘అమెరికా దేశ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన జోబైడెన్, కమలా హారిస్‌కు శుభాకాంక్షలు. భారత-అమెరికా బంధాలు ఎన్నో ద్వైపాక్షిక విలువలపై ఆధారపడి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత బలపడతాయని బలంగా నమ్ముతున్నా’’ అని వెంకయ్య ట్వీట్ చేశారు.

Updated Date - 2021-01-21T05:00:23+05:30 IST