ఏకీకృత సర్వీసు సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2021-03-16T10:18:54+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఏకీకృత సర్వీసుల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు

ఏకీకృత సర్వీసు సమస్యలు పరిష్కరించాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యతో ఉపాధ్యాయ సంఘాల బేటీ


న్యూఢిల్లీ, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ర్టాల్లో ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఏకీకృత సర్వీసుల సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు సహకరించాలని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవ అధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసుల రెడ్డి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇక్కడ వెంకయ్య నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఉపాధ్యాయ సమస్యలను ఏకరువు పెట్టి, వినతి పత్రం సమర్పించారు. గతంలో వెంకయ్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చొరవతోనే రాష్ట్రపతి గెజిట్‌ విడుదలైందని, అయితే సాంకేతిక కారణాలవల్ల న్యాయస్థానంలో కొన్ని అంశాలు అమలుకు నోచుకోలేదని గుర్తు చేశారు. సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఉపరాష్ట్రపతి సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Updated Date - 2021-03-16T10:18:54+05:30 IST