యువతలో నైపుణ్యాలు పెంచాలి: వెంకయ్య

ABN , First Publish Date - 2021-08-02T07:38:29+05:30 IST

యువతలో నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు పెంచుకుంటే మహిళలు సాధికారత సాధించవచ్చని చెప్పారు.

యువతలో నైపుణ్యాలు పెంచాలి: వెంకయ్య

‘జీఎంఆర్‌ ఫౌండేషన్‌’ కేంద్రాన్ని సందర్శించిన ఉప రాష్ట్రపతి

శంషాబాద్‌ రూరల్‌, ఆగస్టు 1: యువతలో నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. వృత్తికి సంబంధించిన నైపుణ్యాలు పెంచుకుంటే మహిళలు సాధికారత సాధించవచ్చని చెప్పారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ సెంటర్‌ ఫర్‌ ఎంపర్‌మెంట్‌ అండ్‌ లైవ్లీహుడ్‌’ను ఆదివారం వెంకయ్య సందర్శించారు. ఫౌండేషన్‌లో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులతో ముచ్చటించారు. ఎయిర్‌పోర్ట్‌ క్యాంప్‌సలోని వరలక్ష్మి ఫౌండేషన్‌, చిన్మయ మిషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న జీఎంఆర్‌-చిన్మయ విద్యాలయాలను కూడా వెంకయ్య సందర్శించారు. దేశంలోని 20ప్రాంతాల్లో జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ సేవలు 15ఏళ్లకు పైగా కొనసాగుతున్నాయని ఉపరాష్ట్రపతికి ఆ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఎయిర్‌పోర్టు సమీప గ్రామాలకు చెందిన 100మంది విద్యార్థుల చదువులకయ్యే ఖర్చును ఫౌండేషన్‌ భరిస్తోందన్నారు. ఈ ఫౌండేషన్‌ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జీఎంఆర్‌ వరలక్ష్మి ఫౌండేషన్‌ను వెంకయ్య అభినందించారు.

Updated Date - 2021-08-02T07:38:29+05:30 IST