ఆస్ట్రేలియాలో భారత్‌కు ఇలా అవుతోందేంటి?

ABN , First Publish Date - 2021-01-12T02:26:36+05:30 IST

ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది మొదలు భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఒకరి తర్వాత ఒకరిగా గాయాలతో

ఆస్ట్రేలియాలో భారత్‌కు ఇలా అవుతోందేంటి?

సిడ్నీ: ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది మొదలు భారత జట్టును గాయాల బెడద వేధిస్తోంది. ఒకరి తర్వాత ఒకరుగా గాయాలతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో బ్రిస్బేన్‌లో జరగనున్న నాలుగో టెస్టు నుంచి హనుమ విహారీ తప్పుకున్నాడు. కండరాల గాయంతో బాధపడుతున్న విహారి నేడు ముగిసిన మూడో టెస్టులో బాధను అనుభవిస్తూనే బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. 


మ్యాచ్ పూర్తయిన వెంటనే విహారిని స్కానింగ్‌కు తీసుకెళ్లారు. గాయం చిన్నదే అయినప్పటికీ బ్రిస్బేన్ టెస్టు ప్రారంభమయ్యే 15వ తేదీ నాటికి కోలుకునే అవకాశం లేకపోవడంతో విశ్రాంతి కల్పించారు. మూడో టెస్టులో విహారీ 161 బంతులు ఎదుర్కొని 23 పరుగులు మాత్రమే చేశాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి నిదానంగా ఆడుతూ మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ను కూడా విహారి మిస్సయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.  


ఇక, ఆస్ట్రేలియాలో గాయపడి సిరీస్‌కు దూరమైన భారత ఆటగాళ్ల జాబితా చాలానే ఉంది. తొలి టెస్టులో పేసర్ మహ్మద్ షమీ గాయపడగా, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. మూడో టెస్టులో రవీంద్ర జడేగా గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు.


ఓపెనర్‌గా దిగి తొలి రెండు టెస్టుల్లోనూ పేలవ ప్రదర్శనతో మూడో టెస్టుకు దూరమైన మయాంక్ అగర్వాల్‌ను ఇప్పుడు మిడిలార్డర్‌లో విహారి స్థానంలో తీసుకునే అవకాశం ఉంది. లేదంటే, వృద్ధిమాన్ సాహాకు కూడా అవకాశం దక్కొచ్చు. ఇక, జడేజా స్థానంలో శార్దూల్ ఠాకూర్,  టి. నరాజన్‌లలో ఎవరో ఒకరితో భర్తీ చేసే అవకాశం ఉంది.

Updated Date - 2021-01-12T02:26:36+05:30 IST