కేసీఆర్ ఇక మీదట ఆ అబద్ధం చెప్పకుంటే మేలు: రాములమ్మ
ABN , First Publish Date - 2021-08-28T17:52:16+05:30 IST
తెలంగాణ ప్రజానీకం ఏది మర్చిపోలేదని.. ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ సర్వ ద్రోహాలకూ పాల్పడ్డారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. తెలంగాణ కోసం చావు నోట్లో తల బెట్టానని కేసీఆర్ చెబుతున్న అబద్దాలు..
హైదరాబాద్: తెలంగాణ ప్రజానీకం ఏది మర్చిపోలేదని.. ఏడేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ సర్వ ద్రోహాలకూ పాల్పడ్డారని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. తెలంగాణ కోసం చావు నోట్లో తల బెట్టానని కేసీఆర్ చెబుతున్న అబద్దాలు.. ఇక మీదట చెప్పకుంటే మేలన్నారు. కేసీఆర్ దొంగ దీక్ష ఖమ్మం హాస్పిటల్.. ఇంకా నిమ్స్‌ల నడించిందని ఎద్దేవా చేశారు. ‘‘సీఎం కేసీఆర్ గారు దళితుల కోసం చివరి రక్తపుబొట్టు వరకూ సేవ చేస్తా అన్న ప్రకటన కన్నా హస్యాస్పదమైన అంశం ప్రస్తుతం మరొక్కటి ఉండదు.
దళిత ముఖ్యమంత్రి పదవి గుంజుకుని... దళిత డిప్యూటీ సీఎంలను అవమానకరంగా వెళ్ళగొట్టి... 3 ఎకరాల భూమి అంటూ మోసగించి... డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎగ్గొట్టి... నిరుద్యోగభృతికి సున్నా చుట్టి... ఇప్పుడు ఏడేళ్ళ కాల పరిపాలనల దళితుల పట్ల సర్వ ద్రోహాలకూ పాల్పడ్డ ఈ దొర ముఖ్యమంత్రిగారు, హుజురాబాద్ భయంతో అనేక అసత్యాలు మాట్లాడుతున్నరు. ఇంకా, చావు నోట్ల తల బెట్టి తెలంగాణ తెచ్చిన... అన్న అబద్ధం వారు చెప్పకుంటే మేలు. ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారి దొంగ దీక్ష ఖమ్మం హాస్పిటల్... ఇంకా నిమ్స్‌ల నడిచింది 2009ల... ప్రజా ఉద్యమాలతో తెలంగాణ వచ్చింది 2014ల... ఆనాటి హాస్పిటళ్ళలో కేసీఆర్ గారు తీసుకున్న ఆహార జ్యూస్‌లు, ఓయూ నుంచి విద్యార్థి సంఘాల హెచ్చరికలు, ఇంకా ఐవీ ఫ్లూయిడ్‌లు, దీక్ష విరమణకై ప్రభుత్వాన్ని బతిమాలుకున్న అంశాల్ని ఇంకా తెలంగాణ సమాజం యాద్ మర్వలే’’ అని రాములమ్మ పేర్కొన్నారు.