ఉద్యోగుల వాట్సప్ చెక్ చేసి మరీ అరెస్ట్‌లు...విజయవాడలో టెన్షన్ వాతావరణం

ABN , First Publish Date - 2022-02-03T14:53:08+05:30 IST

పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది.

ఉద్యోగుల వాట్సప్ చెక్ చేసి మరీ అరెస్ట్‌లు...విజయవాడలో టెన్షన్ వాతావరణం

విజయవాడ: పీఆర్సీ సాధన సమితి తలపెట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఉద్యోగులు తలపెట్టిన ఛలో విజయవాడకు ఎటువంటి అనుమతులు లేవంటూ ఉద్యోగులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే ఉద్యోగస్థులను ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు ప్రత్యేక పోలీస్ బలగాలని నగరం వెలుపల ఏర్పాటు చేశారు. విజయవాడకు వస్తున్న ప్రతి బస్సును, కార్‌ను, టు వీలర్‌ను పోలీసులు ఆపి చెక్ చేస్తున్నారు. ఎంప్లాయిస్ వాట్సాప్ చెక్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారు.


ఆరెస్ట్ చేసిన వారిని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. నగర సివారు ప్రాంతాలైన తాడిగడప, నిడమానూరు, వారధి, గొల్లపూడి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలోకి ప్రవేశించే ప్రతీ వాహనాన్ని క్షుణంగా పరిశీలించిన తరువాతే నగరంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు.  కాగా... ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అడ్డుకున్నా ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఉద్యోగస్తులు స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-03T14:53:08+05:30 IST