గర్భిణీకి వైద్య సేవలందించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-03-30T21:25:13+05:30 IST

తాజాగా ఓ గర్భిణీకి వైద్య సేవలు అందించారు. మోమిన్ పేట్ మండలంలోని టేకులపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

గర్భిణీకి వైద్య సేవలందించిన ఎమ్మెల్యే

వికారాబాద్: వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్.. అవసరమైనప్పుడు స్టెతస్కోప్ పడుతూ తన వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. తాజాగా ఓ గర్భిణీకి వైద్య సేవలు అందించారు. మోమిన్ పేట్ మండలంలోని టేకులపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నవరత్నం గౌడ్ భార్య సూధారాణి 9 నెలల గర్భిణి. నొప్పులతో బాధపడుతుండగా.. ఆమె భర్త నవరత్నం ఎమర్జెన్సీ హెల్ప్ లైన్‌కు కాల్ చేశాడు. అయితే అదే గ్రామంలో ఓ ప్రభుత్వ కార్యక్రమంపై వచ్చిన ఆనంద్‌కు ఈ విషయం తెలిసింది. వెంటనే ఆయన అక్కడకు వెళ్లి సుధారాణికి పరీక్షలు చేశారు. రిపోర్టులు అన్నీ పరిశీలించారు. రక్తం తక్కువగా ఉందని, పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పారు. కాన్పుకు ఇంకా 20 రోజుల సమయం ఉందని, పురిటి నొప్పులు వస్తే వెంటనే ఫోన్ చేయాలని తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. అంతేగాక సుధారాణికి మందులు కూడా రాసిచ్చారు. ఆమెకు కావలసిన సహకారం అందించాలని స్థానిక ఆశా వర్కర్లు గోవిందమ్మ, మార్తమ్మలను సూచించారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్ నవనీత విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహ రెడ్డి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-03-30T21:25:13+05:30 IST