హరితహారం కోసం ఊరికొక పోలీస్‌

ABN , First Publish Date - 2020-07-08T10:55:58+05:30 IST

హరితహారం విజయవంతం కోసం జిల్లాలో ఊరికొక కానిస్టేబుల్‌ను ప్రత్యేక విధుల కోసం ..

హరితహారం కోసం ఊరికొక పోలీస్‌

వికారాబాద్‌ ఎస్పీ నారాయణ


పరిగి/నవాబుపేట/వికారాబాద్‌/తాండూరు/కులకచర్ల/కొడంగల్‌ : హరితహారం విజయవంతం కోసం జిల్లాలో ఊరికొక కానిస్టేబుల్‌ను ప్రత్యేక విధుల కోసం కేటాయించినట్లు వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నారాయణ తెలిపారు. మంగళవారం పరిగి మండలం నస్కల్‌ గ్రామంలో ఆరో విడత హరితహరం కింద ఎస్పీ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పరిగి డిఎస్పీ జి.శ్రీనివాస్‌, సీఐ డీకే లక్ష్మీరెడ్డి, ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, శ్రీశైలం, సురేష్‌, సర్పంచి పద్మమ్మ, నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  నవాబుపేట  మండలం పూలపల్లి, గంగ్యాడ గ్రామాల్లో ఎస్సీ నారాయణ, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొక్కలు నాటారు.


కార్యక్రమంలో డీఎస్పీ సంజీవరావు, సీఐ నరేష్‌,  సర్పంచులు నర్సింహారెడ్డి, పర్మయ్య, గోవిందమ్మ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. వికారాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్‌  ఆవరణలో సీఐ ప్రమీల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఇంకా పోలీస్‌ సిబ్బంది, ప్రజాప్రతినిఽధులు పాల్గొన్నారు. తాండూరు పట్టణంలోని 9వ వార్డులో మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ దీపానర్సింహులు మొక్కలను పంపిణీ చేశారు. కులకచర్లలో సర్పంచ్‌ సౌమ్యారెడ్డి డ్వాక్రా సంఘాల మహిళలకు మొక్కలు పంపిణీ చేసి మాట్లాడారు.  అలాగే చెల్లాపూర్‌లో సర్పంచ్‌ వెంకటయ్య, కార్యదర్శి మురళీగౌడ్‌ గ్రామంలో మొక్కలు నాటారు. కొడంగల్‌ పట్టణంలో మున్సిపల్‌ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా పలు రకాల మొక్కలు నాటారు.

Updated Date - 2020-07-08T10:55:58+05:30 IST