‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో మన్కడ్‌

ABN , First Publish Date - 2021-06-14T09:49:42+05:30 IST

భారత దిగ్గజం వినూ మన్కడ్‌కు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటుదక్కింది.

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లో మన్కడ్‌

దుబాయ్‌: భారత దిగ్గజం వినూ మన్కడ్‌కు ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటుదక్కింది. వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌పను సందర్భంగా ప్రత్యేక హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ను ఐసీసీ ప్రకటించింది. శకానికి ఇద్దరు చొప్పున ఐదు శకాలనుంచి 10 మంది దిగ్గజ ఆటగాళ్ల జాబితాను ఆదివారం విడుదల చేసింది. 1918 ముందు శకం నుంచి అవ్‌బ్రే ఫాల్క్‌నర్‌ (దక్షిణాఫ్రికా), మాంటీ నోబెల్‌ (ఆస్ట్రేలియా).. ప్రపంచ యుద్ధాల మధ్యనున్న శకాలనుంచి కాన్‌స్టెంటైన్‌ (వెస్టిండీస్‌), మెకాబె (ఆస్ట్రేలియా).. యుద్ధానంతర శకం (1946-1970) నుంచి డెక్స్‌టర్‌ (ఇంగ్లండ్‌), వినూ మన్కడ్‌ (భారత్‌).. వన్డేల శకం (1971-1995) నుంచి డెస్మండ్‌ హేన్స్‌ (వెస్టిండీస్‌), బాబ్‌ విల్స్‌ (ఇంగ్లండ్‌).. ఆధునిక శకం (1996-2016) నుంచి ఆండీ ఫ్లవర్‌ (జింబాబ్వే), సంగక్కర (శ్రీలంక)ను ఎంపిక చేశారు. 

Updated Date - 2021-06-14T09:49:42+05:30 IST