రెవెన్యూ కోర్టుల్లో వర్చువల్‌ విచారణ

ABN , First Publish Date - 2021-05-08T08:47:49+05:30 IST

కరోనా కారణంగా రెవెన్యూ కోర్టుల విచారణ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వర్చువల్‌ విధానంలో ప్రత్యేక ట్రైబ్యునళ్లలో విచారణ జరుపుతున్నారు.

రెవెన్యూ కోర్టుల్లో వర్చువల్‌ విచారణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి ):  కరోనా కారణంగా రెవెన్యూ కోర్టుల విచారణ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు వర్చువల్‌ విధానంలో ప్రత్యేక ట్రైబ్యునళ్లలో విచారణ జరుపుతున్నారు. ట్రైబ్యునళ్లు ఇదివరకు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీళ్లు పెట్టుకున్న వారు నిర్ణీత షెడ్యూళ్లలో వాదన వినిపించాలని కలెక్టర్లు నిర్దేశించారు. దాంతో న్యాయవాదులు ఆన్‌లైన్‌లో తమ వాదనలు వినిపిస్తున్నారు. 33 జిల్లాల్లో 16వేల కేసులుండగా.. హైకోర్టు ఆదేశాలతో పునర్విచారణకు నిర్ణయించిన కేసులు 12వేల దాకా ఉన్నాయి. వాదనలన్నీ విన్న తర్వాత జిల్లా యంత్రాంగం కేసులపై తీర్పులు వెలువరించనుంది. 

Updated Date - 2021-05-08T08:47:49+05:30 IST