Visakhapatnam: పలు రైళ్లు రద్దు...రీషెడ్యూల్‌

ABN , First Publish Date - 2021-08-01T12:10:40+05:30 IST

సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వర్షం నీరు చేరడంతో పలు రైళ్లు రద్దు, గమ్యాల కుదింపు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం

Visakhapatnam: పలు రైళ్లు రద్దు...రీషెడ్యూల్‌

విశాఖపట్నం: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని హౌరా, టికియపరా స్టేషన్ల వద్ద వర్షం నీరు చేరడంతో పలు రైళ్లు రద్దు, గమ్యాల కుదింపు చేసినట్టు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. ఆదివారం యశ్వంత్‌పూర్‌లో బయలుదేరాల్సిన 02246 నంబరు గల యశ్వంత్‌పూర్‌-హౌరా  రైలును రద్దు చేశారు.


గమ్యాల కుదింపు

02703 నంబరు గల హౌరా-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు ఆదివారం ఉదయం 9.35 గంటలకు షాలిమార్‌లో బయలుదేరనుంది. 


దారి మళ్లింపు

ఈశాన్య సరిహద్దు  రైల్వే పరిధిలో ఆధునికీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో సోమవారం సిలిచర్‌లో బయలుదేరే సిలిచర్‌-త్రివేండ్రం(02509), ఐదున గౌహతిలో బయలుదేరే గౌహతి-సికింద్రాబాద్‌(02514) ప్రత్యేక రైళ్లు న్యూ కూచ్‌ బెహర్‌, మాతాభాంగ్‌, టీస్తా, రాణినగర్‌ మీదుగా నడుస్తాయి.

Updated Date - 2021-08-01T12:10:40+05:30 IST