Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఢిల్లీ చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం

ఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉక్కు కార్మికులు ఢిల్లీకి చేరుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో యూనియన్‌ నేతలు ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రులతో యూనియన్‌ నేతల భేటీకి విజయసాయిరెడ్డి ప్రయత్నిస్తున్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, ధర్మేంద్ర ప్రధాన్‌లతో నేతలు భేటీ కావాలనుకుంటున్నారు. ప్రధాని మోదీని కూడా యూనియన్‌ నేతలు కలవాలనుకుంటున్నారు. అయినా ఇంతవరకూ  ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారు కాలేదు. ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం వైసీపీ ప్రయత్నించలేదనే ఆరోపణలు వస్తున్నాయి.


విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు 1960వ దశకం విద్యార్థులు, యువత ఆకాంక్షల నుంచి పుట్టిన నినాదం. తెలుగు వారందరినీ ఏకం చేసి, మహోజ్వల పోరాటానికి తెరతీసిన  అపూర్వ ఘట్టం. ఆడిన మాట తప్పిన ఢిల్లీ పెద్దల చెవులు మెలిపెట్టి మరీ, సాధించుకున్న తెలుగు జాతి ఉక్కు సంకల్పానికి ప్రతీక... విశాఖ ఉక్కు కర్మాగారం. కొన్ని వేలమంది త్యాగఫలం, 32మంది ప్రాణత్యాగంతో పురుడుపోసుకున్న ఈ కర్మాగారం ప్రైవేటుపరం కానున్నదని తెలిసి తెలుగు సమాజం ఉలిక్కిపడింది. ఆంధ్రుల అస్తిత్వాన్ని నిలిపిన ఈ ఫ్యాక్టరీని కాపాడుకొనేందుకు మరో ఉద్యమానికి పిలుపు నిచ్చింది. 

Advertisement
Advertisement