వివో నుంచి వచ్చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్.. వివో వి21ఈ 5జీ

ABN , First Publish Date - 2021-06-25T00:04:57+05:30 IST

వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ ‘వివో వి21ఈ 5జీ’ వచ్చేసింది. ఇండియాలో లాంచ్ అయిన ఇది సింగిల్ ర్యామ్

వివో నుంచి వచ్చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్.. వివో వి21ఈ 5జీ

న్యూఢిల్లీ: వివో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్‌ఫోన్ ‘వివో వి21ఈ 5జీ’ వచ్చేసింది. ఇండియాలో లాంచ్ అయిన ఇది సింగిల్ ర్యామ్, స్టోరేజీతో వస్తోంది. ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. నాచ్‌డ్ డిస్‌ప్లే‌తో కూడిన సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. 


వివో వి21ఈ 5జీ 8జీబీ+128జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 24,990 మాత్రమే. డార్క్ పెర్ల్, సన్‌సెట్ జాజ్ రంగుల్లో అందుబాటులో ఉంది. వివో ఆన్‌లైన్ స్టోర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బజాజ్ ఫిన్‌సెర్వ్ ఈఎంఐ స్టోర్లలో అందుబాటులో ఉండగా త్వరలోనే టాటా క్లిక్, పేటీఎంలోనూ అందుబాటులోకి రానుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతోపాటు ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 2,500 క్యాష్‌బ్యాక్ లభించనుంది. జూన్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అలాగే, రూ. 1000 విలువైన అమెజాన్ ఓచర్ కూడా లభిస్తుంది. 


వివో వి21ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు: ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11.1. 6.44 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, అండర్ ది హుడ్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్ (3 జీబీ వరకు సాఫ్ట్‌వేర్ ఎక్స్‌టెన్షన్ సపోర్ట్), 128 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజీ, 1 టీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు రెండు కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 44W చార్జింగ్ సపోర్ట్ వంటివి ఉన్న ఈ ఫోన్ బరువు 167  గ్రాములు మాత్రమే. 


Updated Date - 2021-06-25T00:04:57+05:30 IST