వీఎల్‌సీసీ...సెబీకి ఐపీఓకు డ్రాఫ్ట్ దాఖలు

ABN , First Publish Date - 2021-08-15T23:10:06+05:30 IST

వీఎల్‌నసీసీ హెల్త్ లిమిటెడ్,,, ఐపీఓ ద్వారా ఫండ్స్ సేకరించేందుకు సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్‌ను దాఖలు చేసింది.

వీఎల్‌సీసీ...సెబీకి ఐపీఓకు డ్రాఫ్ట్ దాఖలు

ముంబై : వీఎల్‌నసీసీ హెల్త్ లిమిటెడ్,,, ఐపీఓ ద్వారా ఫండ్స్ సేకరించేందుకు సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్‌ను దాఖలు చేసింది. ఐపీఓ రూ.300 కోట్ల ఫ్రెష్ ఇష్యూ ఈక్విటీ షేర్లను కలిగి ఉంది. వాటాదారులు, ప్రమోటర్స్ ద్వారా 8.92 మిలియన్ షేర్స్ ఆఫర్ ఫర్ సేల్ కింద ఉన్నాయి. ఐపీఓకు ఇష్యూ మేనేజర్స్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, డీఏఎం కేపిటల్ అడ్వైజర్స్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ ఉన్నాయి.  రూ. 83.24 కోట్ల విలువైన ఈ ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయం భారతదేశం, గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) రీజియన్‌లోని వీఎల్‌సీసీ వెల్‌నెస్ క్లినిక్‌లను పునరుద్ధరించడానికి ఉపయోగించనున్నారు. అలాగే రూ. 66 కోట్లను రుణాన్ని తిరిగి చెల్లించేందుకు వినియోగించనున్నారు.


బ్రాండ్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడికి రూ. 30.80 కోట్లు, డిజిటల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో  పెట్టుబడికి రూ. 40 కోట్లను వినియోగించనున్నారు. భారతదేశంలోనే వెల్‌నెస్, బ్యూటీ సర్వీసెస్‌కు  చెందిన ప్రముఖ పరిశ్రమల్లో వీఎల్‌సీసీ కేడా ఒకటి. కంపెనీ నిర్వహించే క్లినిక్‌లు భారత్‌లో దాదాపు అన్ని నగరాల్లోనూ విస్తరించాయి. మార్చి 2021 నాటికి దక్షిణాసియా, ఆగ్నేయాసియా, జీసీసీ ప్రాంతం, తూర్పు ఆఫ్రికాలోని పన్నెండు దేశాలలోని 143 నగరాల్లో ఉన్న 310 ప్రదేశాలలో దీనికి వినియోగదారులున్నారు. 

Updated Date - 2021-08-15T23:10:06+05:30 IST