హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి

ABN , First Publish Date - 2021-01-26T04:46:54+05:30 IST

‘‘ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రతి పౌరునికీ హక్కులతో పాటు బాధ్యతలు అధికారాలను కల్పించిందని... హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తించాలని ’’ కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ పిలుపునిచ్చారు.

హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించాలి
ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ కర్ణన్‌

ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించాలి  

 యువ ఓటర్లకు కలెక్టర్‌ కర్ణన్‌ పిలుపు 

 ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 25: ‘‘ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం ప్రతి పౌరునికీ హక్కులతో పాటు బాధ్యతలు అధికారాలను కల్పించిందని... హక్కులతో పాటు బాధ్యతలను నిర్వర్తించాలని ’’  కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన ఓటును మంచి ప్రభుత్వాలు ఏర్పాటయ్యేందుకు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. సోమవారం 11వ జాయతీ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో  ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తగా ఓటుహక్కునమోదు చేసుకున్న యువ ఓటర్లకు ఓటుహక్కు వినియోగం, ఓటరు సాధికారత, అప్రమత్తత భద్రత, ప్రశ్నించే తత ్వం తదితర అంశాలపై కలెక్టర్‌ అవగాహన కల్పించారు. అసత్య ప్రచారం సమాచారాన్ని విశ్వసించ వద్దని కలెక్టర్‌ హితవుపలికారు.  జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా చీఫ్‌ ఎన్నికల అధికారి సునీల్‌ అరోరా సందేశాన్ని ఈ సందర్భంగా యువ ఓటర్లకు వీక్షింప చేశారు.  దేశ వ్యాప్తంగా ఓటరు అవగాహన కార్యక్రమాలపై రూపొందించిన కార్యక్రమాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏళ్లు నిండి కొత్తగా ఓటరుగా నమోదైన యువతకు కలెక్టర్‌ ఆర్వీకర్ణన్‌ ఓటరు గుర్తింపు కార్డులను అందచేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, డీఆర్వో ఆర్‌ శిరీష, స్వీప్‌ నోడల్‌ అధికారులు కొండపల్లి శ్రీరాం, సుమన్‌చక్రవర్తి, పరంధామిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఎవో మదన్‌గోపాల్‌, పర్యవేక్షకులు రాంబాబు, షర్ఫుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు. 

జిల్లా టీఎన్జీవో కార్యాలయంలో..

 జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జిల్లా టీఎన్జీవో కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పొట్టపింజర రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశంలో రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి హక్కులతో పాటు విధులను కల్పించిం దన్నారు. పౌరులు తమ విధులను, బాధ్యతలను గుర్తెరిగి సమాజాభివృద్ధికి పాటుపడే ప్రజాప్రతినిదులను ఎన్నుకోవాలన్నారు. దీనికోసం ప్రతి ఓటరు , ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఆఫీసర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గంగవరపు బాలకృష్ణ, కోశాధికారి వల్లోజి శ్రీనివాసరావు, అసోసియేట్‌ అధ్యక్షుడు కొమరగిరి దుర్గాప్రసాద్‌, జైపాల్‌, ఆయూష్‌ ప్రకాష్‌, వెంకన్న, కత్తుల రవి, రాజ, రవికుమార్‌, పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. 

 వైరా: మండలంలోని గన్నవరం హైస్కూల్లో సోమవారం జాతీయ ఓటరు దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈవో వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ప్రతిజ్ఞ చేశారు. హెచ్‌ఎం కె.సైదయ్య, ఉపాధ్యాయులు భవానీ, నిర్మల, రామకృష్ణస్వామి, బీఎల్‌వో అనిత పాల్గొన్నారు.

ముదిగొండ: జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంఈవో బాణాల రామాచారి, డీటీ కరుణాకర్‌రెడ్డి, ఎంపీవో సూర్యనారాయణ, ఆర్‌ఐలు ఏకవీర, ఉషారాణి పాల్గొన్నారు.

కొణిజర్ల: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కొణిజర్లలో సోమవారం మండల అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఓటు ఆవశ్యకతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్‌ క్రిష్ణ, ఎంపిడివో రమాదేవి, ఎంపివో ప్రభాకర్‌రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 మధిరటౌన్‌: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని ఆర్డీఓ మదుసూదన్‌రావు అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సం సంధర్బంగా సోమవారం తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం ఓటర్‌ కార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సైదులు, బీఎల్‌వోలు సిబ్బంది పాల్గొన్నారు.  సబ్‌ జైలులో జైలర్‌ ప్రభాకర్‌ రెడ్డి సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు.

సత్తుపల్లిరూరల్‌: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు అనేది వజ్రాయుధం వంటిదని జేవీఆర్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్‌ పానెం రామచంద్రరావు అన్నారు. మానవీయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమ్‌సాగర్‌, విజయ్‌కుమార్‌, వీరన్న, కిరణ్‌కుమార్‌, బంగారీ, వీరారెడ్డి, చెన్నారావు, కృష్ణారావు, విజయలక్ష్మీ, సుభాషిణీ, చాంద్‌భాషా, సత్యనారాయయణ పాల్గొన్నారు.

  కల్లూరు/పెనుబల్లి: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కల్లూరు జీజేసీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మంగీలాల్‌, ఎంపీడీవో నవాబ్‌పాషా, ప్రజాప్రతినిధులు డాక్టర్‌ లక్కినేని రఘు, కొండూరి కిరణ్‌, మాదిరాజు లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సోమవారం అధికారులు, ప్రజాప్రతినిధులు స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ప్రతిజ్ఞ చేశారు.   తహసీల్దార్‌ రమాదేవి, ఎంపీడీవో మహాలక్ష్మీ, సర్పంచ్‌ తావునాయక్‌, గిర్దావర్‌లు జానిమియా, సంతో్‌షకుమార్‌, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

నేలకొండపల్లి, జనవరి25: ప్రజాస్వామ్యంలో ఓటు ఒక ఆయుధమని  నేలకొండపల్లి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి ఆమోస్‌ అన్నారు. సోమవారం కళాశాలలో జాతీయ సేవా పధకం(ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో 11వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఆమోస్‌ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T04:46:54+05:30 IST