Abn logo
Oct 23 2021 @ 00:00AM

ఫేస్‌బుక్‌ పేరు మారనుందా?

సోషల్‌ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్‌’ వచ్చే వారమే రీబ్రాండ్‌ చేసుకునే యోచనలో ఉందని ‘వెర్జ్‌’ పేర్కొంది. అయితే రూమర్లు, స్పెక్యులేషన్లపై వ్యాఖ్యానించేది లేదని ఫేస్‌బుక్‌ పేర్కొంది. ఫేస్‌బుక్‌పై అమెరికా ప్రభుత్వ స్ర్కూటినీ పెరగడం, అక్కడి కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ మార్పుపై సమాచారం అందుతుండటం గమనార్హం. మొత్తానికి రీబ్రాండ్‌తో పరిస్థితిని సానుకూలం చేసుకునే యత్నంలో ఉంది. అయితే ఇలా పేర్లు మార్చడం సిలికాన్‌ వ్యాలీలో సాధారణం అన్న మాట కూడా వినవస్తోంది.