బీజేపీ భయంతోనే జిల్లాలకు కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-22T09:01:30+05:30 IST

ఉద్యమ నేత ఈటల బీజేపీలో చేరడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే, ఎప్పుడూ బయటకు రాని ఆయన, ఇప్పుడు జిల్లాలు తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

బీజేపీ భయంతోనే జిల్లాలకు కేసీఆర్‌

హుజూరాబాద్‌లో వార్‌ వన్‌సైడే: సంజయ్‌ 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఉద్యమ నేత ఈటల బీజేపీలో చేరడంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే, ఎప్పుడూ బయటకు రాని ఆయన, ఇప్పుడు జిల్లాలు తిరుగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎ్‌సకు అభ్యర్థి కరువయ్యారని అన్నారు. అక్కడ వార్‌ వన్‌సైడే అని, కాషాయ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. రూ.కోట్లు ఖర్చుపెట్టినా టీఆర్‌ఎ్‌సకు డిపాజిట్‌ దక్కదని తేల్చిచెప్పారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడారు. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన కాంగ్రె్‌సకు బీజేపీని విమర్శించే అర్హత లేదని అన్నారు. సీఎం కేసీఆర్‌ అహంకారానికి హుజూరాబాద్‌లో ఓటమి ఖాయమని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ తరుణ్‌ఛుగ్‌ తేల్చిచెప్పారు. హుజూరాబాద్‌ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని అన్నారు. తాము భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. 


వ్యాక్సిన్‌ సెంటర్ల వద్ద ఉచితంగా టీకా ఇస్తున్న ప్రధాని ఫొటో పెట్టకుండా సీఎం కేసీఆర్‌ బొమ్మ పెట్టుకోవడంపై బండి సంజయ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతీ వ్యక్తికి ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలని ప్రధాని మోదీ సంకల్పించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని కరోనా వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని తరుణ్‌ఛుగ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ భాష మార్చుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్‌రావు విజ్ఞప్తి చేశారు. మీరు ఏ పదాలు వాడితే ప్రతిపక్షాలు కూడా అవే వాడతాయని తేల్చిచెప్పారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఇన్‌చార్జ్‌ బాధ్యతలను పార్టీ సీనియర్‌ నేత ఏపీ జితేందర్‌రెడ్డికి అప్పగించినట్లు సంజయ్‌ ప్రకటించారు. 

Updated Date - 2021-06-22T09:01:30+05:30 IST