వరంగల్‌లో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-07-08T14:28:28+05:30 IST
జిల్లాలోని గీసుగొండ కొమ్మాల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
వరంగల్ రూరల్: జిల్లాలోని గీసుగొండ కొమ్మాల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఓ కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా...మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు వరంగల్ గొర్రెకుంట, కీర్తినగర్ కి చెందిన వారుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.