Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాటర్‌మెలన్‌ ఐస్‌క్రీం

ఎండల్లో ఐస్‌ అవ్వండిలా..

ఎండలు మండిపోతున్న వేళ చల్లని ఐస్‌క్రీమ్‌ల మీదకు మనసు లాగుతూ ఉంటుంది. అయితే ఐస్‌క్రీమ్‌ను బయట కొనే బదులు రకరకాల పండ్లతో ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. అవకాడో, మామిడి, వాటర్‌మెలన్‌, డ్రాగన్‌ఫ్రూట్‌, అరటిపండ్లు, స్ట్రాబెర్రీ...వంటి పండ్లతో నోరూరించే ఐస్‌క్రీమ్‌లు చేసుకోవచ్చు.  ఈ వారం ఆ చల్లటి రుచులను మీరూ ఆస్వాదించండి. 


కావలసినవి: వాటర్‌మెలన్‌ జ్యూస్‌ - ఒకటిన్నర కప్పు, ఫ్రెష్‌ క్రీమ్‌ - 400ఎంఎల్‌, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - ఒక టీస్పూన్‌, తియ్యటి కండెన్స్‌డ్‌ మిల్క్‌ - ఒక కప్పు.


తయారీ విధానం: వాటర్‌మెలన్‌ను కట్‌ చేసి మిక్సీలో వేసి జ్యూస్‌ చేసుకోవాలి. తరువాత జాలీతో వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్‌లో క్రీమ్‌ తీసుకుని బీటర్‌తో సాఫ్ట్‌గా అయ్యేలా చేసుకోవాలి. తరువాత  వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ కలపాలి. ఇప్పుడు కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలియబెట్టాలి. తరువాత వాటర్‌మెలన్‌ జ్యూస్‌ను కలపాలి. ఐస్‌క్రీమ్‌ మిక్సర్‌లోకి మార్చుకుని ఫ్రిజ్‌లో పదిగంటలపాటు పెట్టాలి. అంతే... వాటర్‌మెలన్‌ ఐస్‌క్రీమ్‌ రెడీ.

ఉసిరికాయ జ్యూస్‌కస్టర్డ్‌ యాపిల్‌ ఐస్‌క్రీమ్‌ మ్యాంగో తిరమిసు మ్యాంగో బేక్డ్‌ యోగర్ట్‌మ్యాంగో కుల్ఫీఎండుఫలం మిల్క్‌షేక్‌కివి మింట్‌ లెమనేడ్‌ఫలూదామ్యాంగో ఐస్‌క్రీంఅవకాడో ఐస్‌క్రీం
Advertisement