ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం: పెద్ది

ABN , First Publish Date - 2020-05-19T09:29:46+05:30 IST

రైతులు అధైర్యపడొద్దని, ప్రతీగింజను కొలుగోలు చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.

ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం: పెద్ది

నర్సంపేట, మే 18 : రైతులు అధైర్యపడొద్దని, ప్రతీగింజను కొలుగోలు చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ముత్తోజిపేటలోని కొనుగోలు కేంద్రం వద్ద ఆదివారం కురిసిన వర్షానికి ధాన్యం, మక్కలు కొంతమేరకు తడిసి రైతులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసి సోమవారం కొనుగోలు కేం ద్రాన్ని సందర్శించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంమూర్తి, ఏఈవో అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.


ఖానాపురం : అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ హామీ ఇచ్చారు. ఖానాపురం, రాగంపేట, కొత్తూరు, ధర్మరావుపేట గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, మొక్కజొన్న రాసులను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ రామస్వామినాయక్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ వేణుకృష్ణ, సివిల్‌ సప్లయీస్‌ డీఎం భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు. 


నెక్కొండ: గాలివానతో నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి అన్నారు.  సోమవారం పెద్దకొర్పోలులో ఎమ్మెల్యే పర్యటించారు. ఇండ్లపై కప్పులు కొట్టుకుపోయిన, పంటలు నష్టపోయిన వారి వివరాలు రెవెన్యూ కార్యాలయంలో అందించాలన్నారు. అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్‌ ట్రిబ్యునల్‌ మెంబర్‌ గటిక అజయ్‌కుమార్‌ గ్రామంలో నష్ట వివరాలను తెలుసుకున్నారు. 


Updated Date - 2020-05-19T09:29:46+05:30 IST