Advertisement
Advertisement
Abn logo
Advertisement

చంద్రబాబును ఎవరు తిట్టలేదు: విజయసాయి

ఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబును ఎవరు తిట్టలేదని, అసెంబ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఏడుపు ఒక డ్రామా అని తప్పుబట్టారు. ఆయన నాటకాలు ఎవరూ నమ్మరన్నారు. ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కనీసం మద్దతు ధర చట్టం తీసుకురావాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఆహార భద్రత చట్టం అమలులో రాష్ట్రానికి అన్యాయం జరిగింది దానిని సరిదిద్దాలని కోరారు. మహిళా రిజర్వేషన్లు బిల్లును ఆమోదించాలని కోరామని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన దిశ బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఇప్పించాలని విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు.

Advertisement
Advertisement