‘బూమ్రా అరుదైన ఆటగాడు.. జాగ్రత్తగా కాపాడుకోవాలి’

ABN , First Publish Date - 2020-07-05T02:08:53+05:30 IST

జస్ప్రిత్ బూమ్రా. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఈ పేరే ఓ సంచలనం. భారత బౌలింగ్ దళంలో ఓ తురుపుముక్క. తన విచిత్రమైన...

‘బూమ్రా అరుదైన ఆటగాడు.. జాగ్రత్తగా కాపాడుకోవాలి’

న్యూఢిల్లీ: జస్ప్రిత్ బూమ్రా. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఈ పేరే ఓ సంచలనం. భారత బౌలింగ్ దళంలో ఓ తురుపుముక్క. తన చిత్రమైన బౌలింగ్ శైలితో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతూ వికెట్లను చేజిక్కించుకోవడం బూమ్రాకు వెన్నతో పెట్టిన విద్య. టెస్ట్, వన్‌డే, టీ20.. ఇలా ఏ ఫార్మాట్ అయినా బూమ్రాకు తిరుగులేదంటే అతిశయోక్తి కాదు. ఇటీవల జరిగిన అన్ని ఫార్మాట్‌లలో, ప్రతి మ్యాచ్‌లో దాదాపు బూమ్రా ఉన్నాడు. అయితే ఈ స్థాయిలో బూమ్రా చేత అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడించడం అంత శ్రేయస్కరం కాదని కామెంటేటర్, మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ చెబుతున్నారు. బూమ్రా అపారమైన ప్రతిభగల బౌలర్ అని, అతడిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచిస్తున్నాడు. ‘ప్రపంచంలోని అతి తక్కువ మేలైన బౌలర్లలో బూమ్రా ఒకడు. ఏ ఫార్మాట్లో అయినా సత్తా చాటగలడు. అయితే అన్ని మ్యాచ్‌లలో, అన్ని ఫార్మాట్లలో నిర్విరామంగా అతడిని ఆడించడం సరైన పద్ధతి కాదు.


దీనివల్ల ఎక్కువకాలం ఆడలేకపోయే ప్రమాదం ఏర్పడుతుంది. బూమ్రా లాంటి విలువైన ఆటగాళ్లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి’ అంటూ బిషప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా కేవలం బూమ్రాపైనే ఆధారపడకుండా మిగతా బౌలర్లకు పదును పెట్టాల్సిన అవసరం ఉందని భారత్‌కు సూచించారు.

Updated Date - 2020-07-05T02:08:53+05:30 IST