Abn logo
Oct 19 2021 @ 15:54PM

గంజాయి పంటలను సైతం నిర్మూలన చేస్తాం: డీఐజీ రంగారావు

 విశాఖ: గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవాడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు తెలిపారు. రెండు మూడు వారాలుగా ఇతర రాష్ట్రాల పోలీసులు వస్తున్నారని చెప్పారు. అలాగే స్థానిక పోలీసుల సహకారం అవసరం ఉందన్నారు. నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదన్నారు. దాని వల్ల ఈ సమస్య లేవనెత్తిందని డీఐజీ తెలిపారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక పోలీసుల సైతం నిందితుల కోసం గాలిస్తున్నారని తెలిపారు. గంజాయి అనేది ఇప్పుడు పుట్టికొచ్చింది కాదు.. దీనిపై ఎప్పటికప్పుడు  కేసులు నమోదు చేసామని డీఐజీ రంగారావు పేర్కొన్నారు. అన్ని శాఖలు గంజాయి నివారణ కోసం కష్టపడుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం గంజాయి నివారణ కోసం చర్యలు తీసుకొంటుందన్నారు. గంజాయి పంటలను సైతం నిర్మూలన చేస్తామని స్పష్టంచేశారు.