మౌలిక వసతులు కల్పిస్తాం: వనమా

ABN , First Publish Date - 2020-09-21T06:23:17+05:30 IST

గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం మండలంలోని ప్రశాంతినగర్‌

మౌలిక వసతులు కల్పిస్తాం: వనమా

చుంచుపల్లి, సెప్టెంబరు 20: గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం మండలంలోని ప్రశాంతినగర్‌ గ్రామ పంచాయతీలోగల గరిమెళ్లపాడు గిరిజన ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని, గ్రామాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వైద్య మౌలిక వసతు లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాం లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని అన్నారు. అభివృద్ధి పనులకు వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని అన్నారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ కంచర్ల చంద్రశేఖర్‌రావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్‌ శాంతి, ఎంపీడీవో రమేష్‌, ఎంపీడీవో గుంటి సత్యనారాయణ, ప్రశాంతినగర్‌ సర్పంచ్‌ భూక్యా పద్మ, ఎంపీటీసీ రుక్మిణి, కో-ఆప్షన్‌ సభ్యులు ఆరి్‌ఫఖాన్‌, దిశ కమిటీ సభ్యులు గిడ్ల పరంజ్యోతిరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T06:23:17+05:30 IST