Abn logo
Jun 13 2021 @ 23:59PM

చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

చెరువులో తేలియాడుతున్న మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

శామీర్‌పేట : చేపలు పట్టేందుకు చెరువులో దిగిన జాలరికి ఒక్కసారిగా మూర్చ రావడంతో మృతిచెందిన ఘటన శామీర్‌పేట పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  శామీర్‌పేట మండలం లాల్‌గడి మలక్‌పేట గ్రామానికి చెందిన అశోక్‌ వృత్తిరీత్యా జాలరి. కాగా అతడు రోజూ మాదిరిగానే ఆదివారం బాతుపల్లి చెరువులో చేపలు పట్టేందుకు చెరువులోకి దిగాడు. ఈ క్రమంలో చేపలు పడుతుండగా ఒక్కసారిగా మూర్చ రావడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. స్థానికుల సాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.