కుప్పకూలిన విండీస్‌

ABN , First Publish Date - 2021-06-11T10:08:44+05:30 IST

పేసర్లు ఎన్‌గిడి (5/19), అన్రిచ్‌ నోకియా (4/35) నిప్పులు చెరగడంతో వెస్టిండీస్‌ కనీసం వంద పరుగుల మార్క్‌ కూడా దాటలేక పోయింది.

కుప్పకూలిన విండీస్‌

తొలి ఇన్నింగ్స్‌లో 97 ఆలౌట్‌

గ్రాస్‌ ఐస్‌లెట్‌: పేసర్లు ఎన్‌గిడి (5/19), అన్రిచ్‌ నోకియా (4/35) నిప్పులు చెరగడంతో వెస్టిండీస్‌ కనీసం వంద పరుగుల మార్క్‌ కూడా దాటలేక పోయింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా గురువారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 40.5  ఓవర్లలో 97 పరుగులకు కుప్పకూలింది. హోల్డర్‌ (20) టాప్‌ స్కోరర్‌.  దక్షిణాఫ్రికా తరఫున బ్యాట్స్‌మెన్‌ కీగన్‌, వెరియన్నీ.. విండీస్‌ తరఫున సీల్స్‌ అరంగేట్రం చేశారు. 

Updated Date - 2021-06-11T10:08:44+05:30 IST