ఏమని రాయను?

ABN , First Publish Date - 2021-09-16T06:08:58+05:30 IST

అక్షరాలు అరిగిపోతున్నాయి. పదాలు పగిలిపోతున్నాయి. భావాలు భస్మమవుతున్నాయి. కలాలు కమిలిపోతున్నాయి...

ఏమని రాయను?

అక్షరాలు అరిగిపోతున్నాయి.

పదాలు పగిలిపోతున్నాయి.

భావాలు భస్మమవుతున్నాయి.

కలాలు కమిలిపోతున్నాయి.


అంతరిక్షం అంచులు తాకినా

అవనిపై వనితకు మిగిలేది వగపే

హృదయాంతరాలలో తరగని ఆవేదనే


కవితలు కదన కాళికలై

అక్షర సమరం చేసినా

మారని మనుషుల తీరు

చూసి విసిగి విసిగి వేసారిన

మనసులు విరిగి తరిగి అరిగిపోతున్నాయి


సంస్కారం నడయాడిన నేలపైన

కుసంస్కార తాండవమే సకల అనర్థాలకు మూలం.


అమానవీయ అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే,

బాధ్యత మరచిన సమాజానికి సంస్కారం నేర్పాలి

కర్తవ్యం మరచిన పౌరుల్లో చైతన్యజ్వాలలు ఎగదోయాలి 

త్రిపురారి పద్మ

Updated Date - 2021-09-16T06:08:58+05:30 IST