ఆయన ఓ అంపైర్.. ఇప్పుడు ఓవర్‌నైట్ స్టార్..!

ABN , First Publish Date - 2020-10-20T00:05:25+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్ సందర్భంగా ఓ అంపైర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మ్యాచ్‌లో మెయిన్ అంఫైర్‌గా...

ఆయన ఓ అంపైర్.. ఇప్పుడు ఓవర్‌నైట్ స్టార్..!

ఎవరీ రాక్‌స్టార్.. అంపైర్ పశ్చిమ్ పాథక్ గురించి నెటిజనంలో చర్చోపచర్చలు

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మ్యాచ్ సందర్భంగా ఓ అంపైర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మ్యాచ్‌లో మెయిన్ అంఫైర్‌గా మైదానంలోకి అడుగుపెట్టిన పశ్చిమ పాథక్ గురించి నెటిజనంలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఆయన ఫొటోలను చూసిన నెటిజన్లు ఎవరీ రాక్‌స్టార్ అంటూ ఆయన స్టైల్‌కు ఫిదా అవుతున్నారు. స్టైలిష్ అంపైర్ అంటూ కితాబిస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం ఆయన ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే.. అంపైరింగ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో మాత్రమే ఆయనకు ఇది తొలి మ్యాచ్.


క్రికెట్ అంపైరింగ్‌లో పశ్చిమ పాథక్‌కు పదేళ్లకు పైగా అనుభవం ఉంది. ముంబైకి చెందిన పాథక్ దేశవాళీ క్రికెట్‌లో 2009 నుంచి ఉన్నారు. అంతేకాదు, టీమిండియా ఆడిన రెండు టెస్టులకు, మూడు వన్డేలకు రిజర్వ్ అంపైర్‌గా ఉన్నారు. 2012లో టీమిండియా ఉమెన్ క్రికెట్‌ టీం ఆడిన రెండు వన్డే మ్యాచ్‌లకు ఆయన అంపైరింగ్ నిర్వహించారు. ఐపీఎల్‌కు కూడా పాథక్ అంపైరింగ్ కొత్తేమీ కాదు. 2014, 2015 ఐపీఎల్ సీజన్స్‌లో నాలుగు మ్యాచ్‌లకు ఆయన అంపైరింగ్ చేశారు. 2015లో హెల్మెట్ ధరించి అంపైరింగ్ చేసేందుకు మైదానంలో అడుగుపెట్టి వార్తల్లో నిలిచిన ఆయన ప్రస్తుతం హెయిర్ స్టైల్ కారణంగా ఆయన ఓవర్‌నైట్ స్టార్ అంపైర్ అయ్యారు.

Updated Date - 2020-10-20T00:05:25+05:30 IST