పేదలకుఇళ్లు ఇవ్వలేదేం?

ABN , First Publish Date - 2020-10-16T08:53:25+05:30 IST

రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) అమలు చేశారా, లేదా? ఈ పథకం కింద ఎన్ని ఇళ్లు ..

పేదలకుఇళ్లు ఇవ్వలేదేం?

రాష్ట్రంలో పీఎంఏవై అమలు చేశారా లేదా? 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు 

పీఎంఏవై కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్ని? 

కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం 

పూర్తి వివరాలు అందించాలని నోటీసులు

పూర్తయిన గృహాలను లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదు?

రాష్ట్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు 

పీఎంఏవై కింద ఏపీకి ఇచ్చిన నిధులెన్ని? 

కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం 


అమరావతి, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) అమలు చేశారా, లేదా? ఈ పథకం కింద ఎన్ని ఇళ్లు నిర్మితమయ్యాయి? ఎంతమందికి కేటాయించారు? గృహాల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు ఎందుకు కేటాయించలేదు?’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పీఎంఏవై వివరాలను, దానివల్ల లబ్ధిదారులకు కలిగే ప్రయోజనాలను వివరించడంతో పాటు దీనికోసం రాష్ట్రానికి ఎంత నిధులు కేటాయించారో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణశాఖ కార్యదర్శి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఏపీ టౌన్‌షి్‌ప అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పీఎంఏవై కింద రాష్ట్రవ్యాప్తంగా 84వేలకు పైగా గృహాలు నిర్మితమైనా వాటిని లబ్ధిదారులకు కేటాయించలేదని, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరిగ్గా అమలు చేయడం లేదని పేర్కొంటూ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన జె.బాలాజీ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ముందు గురువారం విచారణ జరిగింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సి.పాణినీ సోమయాజి వాదనలు వినిపిస్తూ.. 2015-16నుంచి పీఎంఏవై కింద ఏపీకి 20లక్షల ఇళ్లు కేటాయించారన్నారు.


ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 84,410 గృహాలు సిద్ధమయ్యాయని, కానీ రాష్ట్రప్రభుత్వం వాటిని లబ్ధిదారులకు కేటాయించడం లేదని తెలిపారు. న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ.. ఇళ్ల నిర్మాణం పూర్తయినా, తాగునీరు, విద్యుత్‌ సరఫరా, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలు ఇంకా సమకూరలేదన్నారు. కేటాయింపులకు అవి అనువుగా లేవని చెప్పారు. ఇరుతరఫు వాదలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

Updated Date - 2020-10-16T08:53:25+05:30 IST