Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్త చేతిలో భార్య దారుణ హత్య

ప్రకాశం: భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన  చీమకుర్తి మండలంలో జరిగింది. మండలంలోని మర్రిచెట్లపాలెంలో గురవయ్య, నారాయణమ్మ( 35) దంపతులు నివసిస్తున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబంలో కలహాలు పెరిగాయి. తన భార్య నారాయణమ్మ( 35)ను భర్త గురవయ్య రోకలి బండతో కొట్టి చంపాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement