పేటీఎం... ఏటీఎం కానుందా ?

ABN , First Publish Date - 2021-12-04T00:36:41+05:30 IST

పేటీఎం... ఏటీఎం కానుందా ? సంబంధిత వర్గాల్లో ప్రస్తుతం చక్కెర్లు కొడుతోన్న ప్రశ్న ఇదే. తొట్టతొలి 'బయ్‌' రేటింగ్‌ వచ్చిన నేపధ్యంలో అందరి దృష్టీ ఈ వైపే ఉంది.

పేటీఎం... ఏటీఎం కానుందా ?

నోయిడా : పేటీఎం... ఏటీఎం కానుందా ? సంబంధిత వర్గాల్లో ప్రస్తుతం చక్కెర్లు కొడుతోన్న ప్రశ్న ఇదే. తొట్టతొలి 'బయ్‌' రేటింగ్‌ వచ్చిన నేపధ్యంలో అందరి దృష్టీ ఈ వైపే ఉంది. పేటీఎం... ఏటీఎంగా రూపుదిద్దుకున్నపక్షంలో... ఇన్వెస్టర్ల ఆశలు ఫలించనున్నట్లు చెబుతున్నారు. ఎట్టకేలకు... పేటీఎంకు సంబంధించి మార్కెట్‌లో ఓ సానుకూల దృక్పథం కనిపిస్తోంది. ఈ డిజిటల్‌ పేమెంట్స్‌ జెయింట్‌ తొలిసారి 'బయ్‌' రేటింగ్‌ పొందింది. కాగా... 2026 మార్చి నాటికి కంపెనీ లాభదాయకంగా మారుతుందని ఆశిస్తున్న దోలత్ క్యాపిటల్ మార్కెట్... పేటీఎంను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ. 2,500 నివేదించింది.  ఇది, కంపెనీ ఇష్యూ ప్రైస్‌ కంటే 16 శాతం అధికం. 


మాక్వైరీ క్యాపిటల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ తర్వాత పేటీఎంను కవర్‌ చేస్తున్న మూడో బ్రోకరేజ్‌ దోలత్ క్యాపిటల్ మార్కెట్ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విషయంలో  ఏజెంట్‌ పొజిషన్‌ నుంచి  మ్యానుఫక్చరర్‌గా మారడం, సర్వీసెస్‌ క్రాస్-సెల్లింగ్, యూజర్స్‌ నంబర్‌లో బలమైన వృద్ధిని ఈ కంపెనీలో బ్రోకరేజ్‌ చూస్తోంది. మొదటి రెండు ట్రేడింగ్ సెషన్లలో 37 శాతం క్షీణించిన తర్వాత, జేఎం ఫైనాన్షియల్ సెక్యూరిటీస్... ఈ స్టాక్‌కు 'సెల్‌' రేటింగ్‌ ఇచ్చింది. మాక్వైర్... దీనిని 'అండర్‌పెర్ఫార్మర్‌'గా తేల్చింది. పేటీఎం మాతృ సంస్థ అయిన వన్97 కమ్యూనికేషఫన్స్, ఐపీఓలో 2.5 బిలియన్ డాలర్లను సేకరించినప్పటికీ, లిస్టింగ్‌ రోజు నుంచి మాత్రం సాధారణ ప్రదర్శననే కనబరుస్తోంది.  


పేటీఎంలో..  జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్‌వే, జాక్‌ మాకు చెందిన యాంట్ గ్రూప్ వంటి హేమాహేమీల పెట్టుబడులు ఉన్న విషయం తెలిసిందే. కాగా... పబ్లిక్‌ కంపెనీ హోదాలో మొదటి ఆర్థిక ఫలితాలను పేటీఎం గత గత వారాంతంలో ప్రకటించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో నష్టాలు... సంవత్సరం ప్రాతిపదికన 74.74 బిలియన్లకు పెరిగాయి. 

Updated Date - 2021-12-04T00:36:41+05:30 IST