వారిద్దరి ఒక్క ఏడాది ఆదాయంతో... 10 కోట్ల మందికి రెండు వేల డాలర్ల చొప్పున పంచవచ్చు...

ABN , First Publish Date - 2021-01-05T23:18:50+05:30 IST

బెజోస్, మస్క్ 2020 ఆదాయంతో పది కోట్లమంది అమెరికన్లకు రెండు వేల డాలర్ల చొప్పున పంచవచ్చు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం 2020 క్యాలెండర్ ఏడాదిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగింది.

వారిద్దరి ఒక్క ఏడాది ఆదాయంతో... 10 కోట్ల మందికి రెండు వేల డాలర్ల చొప్పున పంచవచ్చు...

న్యూయార్క్ : బెజోస్, మస్క్ 2020 ఆదాయంతో పది కోట్లమంది అమెరికన్లకు రెండు వేల డాలర్ల చొప్పున పంచవచ్చు. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం 2020 క్యాలెండర్ ఏడాదిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగింది. ఒక్క ఏడాదిలో వీరికి పెరిగిన సంపదతో 10 కోట్ల మంది అమెరికన్లకు రెండు వేల డాలర్ల చొప్పున ఇవ్వవచ్చునని అంచనా వేసింది. ప్రపంచ టాప్ 500 కుబేరుల సంపద గత ఏడాది 31 శాతం పెరిగింది. గత ఎనిమిదేళ్లలో కుబేరులకు ఇదే అత్యధికమని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. 


కరోనా నేపధ్యంలో...  అమెరికా ప్రభుత్వం ఇటీవల ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అమెరికన్లకు ఏ మేరకు, ఎలా సాయం అందుతుందనే అంశం చర్చలో ఉండగానే, అమెరికా కుబేరుల సంపద 2020 లో రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. కేవలం జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది పది కోట్లమంది అమెరికన్లకు రెండు వేల డాలర్ల చొప్పున పంచగలిగే మొత్తంతో సమానం. ఇక... 2020 లో మస్క్ సంపద జూమ్ బ్లూమ్‌బర్గ్


బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద 190 బిలియన్ డాలర్లు. టెస్లా కార్ల కంపెనీ సీఈవో మస్క్ సంపద 170 బిలియన్ డాలర్లు. వీరు ప్రపంచ టాప్ తొలి, రెండో స్థానాల్లో నిలిచారు. ఎలాన్ మస్క్ సంపద 2020 లో ఒక్కసారిగా భారీగా పెరిగింది. ప్రధానంగా టెస్లా షేర్లు పెరగడంతో ఆయన ఆదాయం 75 శాతం వరకు పెరిగింది. 


కరోనా, లాక్ డౌన్, ఆర్థిక అస్తవ్యస్థత కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కాగా...  కరోనా ప్యాకేజీలో భాగంగా అమెరికన్లకు గత మార్చిలో 1,200 డాలర్ల చొప్పున నేరుగా చెల్లించారు. ఆ తర్వాత రెండో ఆర్థిక ప్యాకేజీకి అమెరికన్లు తొమ్మిది నెలలు వేచి చూడాల్సి వచ్చింది. డిసెంబరు లో రెండో కరోనా ప్యాకేజీకి ఆమోదం లభించింది.


Updated Date - 2021-01-05T23:18:50+05:30 IST