పేటీఎం, గూగుల్‌ పే యాప్‌తో ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా!

ABN , First Publish Date - 2021-04-03T06:24:12+05:30 IST

ఇకపై ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు మీ వద్ద డెబిట్‌ కార్డు ఉండనక్కర్లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్‌ యాప్‌ల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు. ఈ

పేటీఎం, గూగుల్‌ పే యాప్‌తో ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా!

  • కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ 
  • సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఏటీఎంల్లో  ఇప్పటికే అందుబాటులోకి సేవలు 
  • త్వరలో మరిన్ని బ్యాంక్‌ల ఏటీఎంల్లో..


ఇకపై ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు మీ వద్ద డెబిట్‌ కార్డు ఉండనక్కర్లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే, అమెజాన్‌ పే వంటి మొబైల్‌ వ్యాలెట్‌ యాప్‌ల్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు. ఈ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫే్‌స (యూపీఐ) ఆధారిత యాప్‌తో క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఏటీఎం తయారీ సంస్థ ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టింది.


యూపీఐ ఆధారిత ఇంటరాపరబుల్‌ కార్డ్‌లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ) ఏటీఎంలను తయారు చేసింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ), సిటీ యూనియన్‌ బ్యాంక్‌ భాగస్వామ్యంలో తొలుత వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. తమకు చెందిన 1,500కు పైగా ఏటీఎంలను ఇప్పటికే ఈ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌తో అప్‌గ్రేడ్‌ చేసినట్లు సిటీ యూనియన్‌ బ్యాంక్‌ వెల్లడించింది. దేశంలోని మరిన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల    ఏటీఎంల్లోనూ ఈ టెక్నాలజీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ విషయమై ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌, ఎన్‌పీసీఐ కలిసి పలు బ్యాంకులతో చర్చలు జరుపుతున్నాయి. ఎన్‌సీఆర్‌ కార్పొరేషన్‌ ఇండియా ఎండీ నవరోజ్‌ దస్తూర్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. 



నగదు తీసుకోవచ్చిలా.. 


ఏటీఎం నుంచి నగదు తీసుకునేందుకు ముందుగా మీ మొబైల్‌లోని యూపీఐ ఆధారిత యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఆ యాప్‌ మీ బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానితమై ఉండటం తప్పనిసరి. 


ఏటీఎంలో క్యూఆర్‌ క్యాష్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తద్వారా ఏటీఎం తెరపై కన్పించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. 


స్కానింగ్‌ పూర్తయ్యాక నగదు విత్‌డ్రా వివరాలను ఎంటర్‌ చేసి, ‘ప్రొసీడ్‌’ బటన్‌ను నొక్కాలి.


ఆ తర్వాత 4 లేదా 6 డిజిటల్‌ యూపీఐ పిన్‌కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఏటీఎం మెషీన్‌ నుంచి నగదు పొందవచ్చు. 


ఈ పద్ధతిలో ఒకసారికి గరిష్ఠంగా రూ.5,000 మా త్రమే ఉపసంహరించుకునే వీలుంటుంది. భవిష్యత్‌లో ఈ పరిమితిని మరింత పెంచే అవకాశముంది.  




ఎస్‌బీఐ యోనో క్యాష్‌ తరహాలో.. 

దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. యోనో లైట్‌ యాప్‌ కస్టమర్లకు ఇప్పటికే ఈ తరహా సేవలందిస్తోంది. డెబిట్‌ కార్డు అవసరం లేకుండా క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా ఎస్‌బీఐ ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది. 


Updated Date - 2021-04-03T06:24:12+05:30 IST